గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చేస్తున్న వార్ 2 మూవీ షూటింగ్ పూర్తవుతున్న వేల, 100 కోట్ల సెట్ బాలీవుడ్ నే కాదు పాన్ ఇండియాని షేక్ చేస్తోంది. పూరీ జగన్నాథుడి టెంపుల్ సెట్ తో ఫిల్మ్ టీం మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేసేలా ఉంది. ఆల్ మోస్ట్ రియల్ పూరీ జగన్నాథుడి టెంపుల్ ని మక్కీకి మక్కీ దీంపేస్తున్నారట. అక్కడే క్లైమాక్ భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కేవీలం ఈ ఒక్క సెట్ కే 100 కోట్లంటేనే సినీజనాల్లో పూనకాలొచ్చేలా ఉన్నాయి. ఇంతకి ఒరిజినల్ టెంపుల్ ఉండగా, వందకోట్లతో సెట్ వేయాల్సిన అవసరమేంటి? జనవరి 30 కి షూటింగ్ పూర్తి అంటున్నారు. కాని ఇంకా డిసెంబర్ వరకు టెంపుల్ సెట్ పనులే జరుగుతాయంటే… వార్2 మాత్రమే తీస్తున్నారా..? పనిలో పనిగా వార్ 3 తాలూకు కంటిన్యూటీ సీన్లేమైనా ప్లాన్ చేశారా? బీటౌన్ లో వస్తున్న గుసగుసలతో ఏం తేలింది?
ఒక్క సెట్ వందకోట్లు… ఆల్ మోస్ట్ ఆ డబ్బుతో ఓ మీడియం సైజు పాన్ ఇండియా మూవీనే తీసేయ్యొచ్చు. కార్తికేయ2, కాంథారా, మేజర్, హనుమాన్ ఇవన్నీ వందకోట్ల లోపు పెట్టుబడితో తీసినవే. కొన్నైతే పది పదిహేనుకోట్లతో తెరకెక్కినవి… అలాంటిది ఒక సినిమాలో ఒకే సెట్ కి 100 కోట్లంటే ఎవరికైనా కళ్లు బర్లు కమ్మాల్సిందే.. అదే వార్2 విషయంలో జరుగుతోంది
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ హీరోగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విలన్ గా తెరకెక్కుతున్న మూవీ వార్2. ఈ స్పై వార్ యాక్షన్ డ్రామా తాలూకు షూటింగ్ కథ క్లైమాక్స్ కి చేరింది. ఐతే ఒరిస్సాలోని పూరీ జగన్నాథ్ టెంపుల్ లో క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్లాన్ చేస్తే, పర్మీషన్ దొరకలేదని తెలుస్తోంది. అందుకే సినిమాకు గుండెలాంటి ఆ క్లైమాక్స్ కోసం వెనక్కి తగ్గకూడదనే, యాజ్ ఇట్ ఈజ్ పూరీ జగన్నాథ్ టెంపుల్ సెట్ ని, భారీ రథాలని సెట్ వేస్తున్నారట
ఇది 20 రోజుల్లో పూర్తయ్యేలోలుప మిగతా ఫైట్ సీన్లు పూర్తి చేసి, జనవరిలో పెండింగ్ క్లైమాక్స్ పూర్తి చేసేలా పనులు నడుస్తున్నాయి. ఐతే ఈ సీన్ లో ఎన్టీఆర్ మాస్క్ వేసుకున్న 1500 మంది ఫైటర్స్ తో హ్రితిక్ ఫైట్ భారీఎత్తున ఉండబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఉండే ఈ సీన్ గురించి లీకులు అందగానే, ఎన్టీఆర్ ఇందులో విలన్ పాత్రే వేసినా, హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడని తేలిపోయింది.
నిజంగా వార్ 2 మూవీని ఎన్టీఆర్ సైన్ చేసినప్పుటి నుంచి ఇప్పటి వరకు నార్త్ లో నే కాదు, సినిమా టీంలో కూడా తన ప్రయారిటీపెరుగుతూ వస్తూ ఉంది. బేసిగ్గా బాలీవుడ్ లో వరుసగా హిట్లు పడితే, హీరోకి ఇమేజ్, రెస్పెక్ట్ పెరిగిందంటంటే అర్ధం ఉంది. కాని త్రిబుల్ ఆర్, దేవర హిట్ల తర్వాత ఫస్ట్ టైం వార్ 2 తో హిందీ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ కి, అది చేస్తుండగానే, మెల్లిగా బీటౌన్ లో ప్రయారిటీ పెరుగుతోంది.
మెల్లి మెల్లిగా వార్ 2లో ఎన్టీఆర్ విలన్ అనే విషయమే పక్కకు పోయిఅంతా తానే అయ్యాడనేలా పరిస్థితులు మారుతున్నాయి. ఏకంగా క్లైమాక్స్ లో 1500 మందకి ఎన్టీఆర్ లాంటి మాస్కే వేసి ఫైట్ ప్లాన్ చేయటం అంటేనే నార్త్ లో ఎన్టీఆర్ ఎలా దూసుకెళ్లబోతున్నాడో, అక్కడి దర్శక నిర్మాతలు తన పాత్ర కెంత ప్రయారిటీ ఇచ్చారో అర్ధమౌతోంది. ఇక బాక్సాఫీస్ బద్దలవ్వటమే మిగిలింది. ఆగస్ట్ 15 కి అదే జరగబోతోంది.