Pushpa 2 : రీ షూట్ కి పుష్ప… రిలీజ్ లేట్ అవుతోందా?

సీన్స్‌ ఊహించినట్టు రాకపోతే.. రీ షూట్ చేయడం ఈమధ్య కామనైపోయింది. పుష్ప2 (Pushpa 2) కూడా రీ షూట్‌లోకి అడుగుపెట్టింది. సినిమా ఇంకా కంప్లీట్‌ కాకుండానే ఈ రీ షూట్స్‌ ఏంటంటూ బన్నీ ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు.

 

సీన్స్‌ ఊహించినట్టు రాకపోతే.. రీ షూట్ చేయడం ఈమధ్య కామనైపోయింది. పుష్ప2 (Pushpa 2) కూడా రీ షూట్‌లోకి అడుగుపెట్టింది. సినిమా ఇంకా కంప్లీట్‌ కాకుండానే ఈ రీ షూట్స్‌ ఏంటంటూ బన్నీ ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు. ఈలెక్కన పుష్ప2 ఆగస్ట్ 15న వస్తుందా? లేదంటే వాయిదా పడుతుందా? సినిమా బాగా రావడం కోసం రీ షూట్స్‌ అందరూ చేసే పనే. రీ షూట్స్‌ చేసినంత మాత్రాన సినిమా గాడి తప్పిందన్న మాట కరెక్ట్ కాదు. ఈ రీ షూట్స్‌ చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. సుకుమార్‌కు ఇలాంటి రీ షూట్స్‌ అలవాటే. తన ప్రతి సినిమాలో రీ షూట్‌ వుండేలా జాగ్రత్తపడతాడు. పుష్ప2లో మూడు సీక్వెన్స్‌ను మళ్లీ తీస్తున్నారని తెలిసింది.

ఇలా రీషూట్స్‌ తీస్తుంటే… టైం వేస్ట్ అవుతోంది.. సినిమా ఆగస్ట్ 15న వస్తుందా? అన్న అనుమానం రావడం సహజమే. ఈ డేట్‌ను మిస్‌ చేసుకోకూడన్న పట్టుదలతో మేకర్స్‌ వున్నారు. అందుకే కాబోలు రెండు యూనిట్స్‌తో షూటింగ్‌ చేస్తున్నారు. లీడింగ్‌ యాక్టర్స్‌ నటిస్తున్న సీన్స్‌ను హైదరాబాద్‌లో… మారేడుమిల్లిలో మరో యూనిట్‌తో సీన్స్‌ తీస్తున్నారు.

పుష్ప2 రిలీజ్ డేట్‌పై అనుమానాలు వచ్చినప్పుడల్లా ఆగస్ట్‌ 15నే వస్తున్నామని మరోసారి విడుదల తేదీ ప్రకటిస్తున్నారు నిర్మాతలు. ఆగస్ట్‌ 15 మిస్ అయితే.. మరో డేట్‌ దొరకదన్న సంగతి తెలీయడంతో… పోస్ట్‌ పోన్‌ అనే మాటకే చోటివ్వడం లేదు. అలాగని వస్తుందన్న గ్యారంటీ కూడా లేదట. ఒకవేళ షూటింగ్‌.. ప్రీ ప్రొడక్షన్‌ పూర్తికాకపోతే వాయిదా తప్పదంటున్నాయి చిత్ర వర్గాలు.. సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్‌ కాగా.. ఐటంసాంగ్‌ కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ ప్రత్యేక గీతాన్ని తీయలేదు. ముందుగా ఐటంగర్ల్‌ ఎవరన్న విషయంలో క్లారిటీ వస్తేగానీ.. ఈ హీట్‌ సాంగ్‌ పట్టాలు ఎక్కదు.