Ilaiyaraaja: ఇళయరాజ బయోపిక్.. రూ.60 కోట్ల పంచ్.. పాపం ధనుష్..!

ఇళయరాజ తన కెరీర్‌లో ఏడాదికి 47 నుంచి 50 వరకు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన సందర్భాలున్నాయి. అలా వెయ్యి సినిమాలకు ఇప్పటి వరకు మ్యూజిక్ కంపోజ్ చేసి ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సొంతం చేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 06:48 PM IST

Ilaiyaraaja: ఇళయరాజ పాటలంటేనే చెవులు కోసుకునే జనాలు కోకొల్లలు. అలాంటి ఇళయరాజ ఇప్పడు నిజంగా తమిళ దర్శక నిర్మాతలకు చెవులు కోసుకునేంత షాక్ ఇచ్చాడు. తన బయోపిక్‌ని ప్లాన్ చేసిన దర్శక, నిర్మాతలకు.. ముఖ్యంగా హీరో ధనుష్‌కి చుక్కలు చూపించాడట. బేసిగ్గా ఇళయరాజ ఏ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసిన వారం మించి టైం తీసుకోడు. అలా తన కెరీర్‌లో ఏడాదికి 47 నుంచి 50 వరకు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన సందర్భాలున్నాయి.

అలా వెయ్యి సినిమాలకు ఇప్పటి వరకు మ్యూజిక్ కంపోజ్ చేసి ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సొంతం చేసుకున్నాడు. తన స్టూడియోలో అతి తక్కువ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ఇంత మ్యజిక్ చేయటం తనకే చెల్లింది. అసలు లండన్‌లో గోల్డ్ మెడల్ తీసుకునే స్టేజ్ నుంచి సౌత్ ఇండియాని కనీసం 40 ఏళ్లు ఏలగలిగిన ఇళయరాజ గతం ఏంటి.? ఆయన ఎలా ఎదిగారు..? ఈప్రశ్నలకు బయోపిక్ సమాధానం అవుతుందనుకున్నారు. అందుకే హీరో ధనుష్.. ఇళయరాజ బయోపిక్ ప్లాన్ చేశాడు. దర్శక నిర్మాతల సాయంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతే, రాయల్టీ కింద ఇళయరాజ రూ.60 కోట్లు అడిగాడట.

ప్రాఫిట్స్‌లో షేర్ కూడా అడిగాడట. ఇంత ఎమౌంట్ తనకి ఇవ్వాల్సి రావటంతో ధనుష్‌తోపాటు దర్శక, నిర్మాతలు షాక్‌లోకెళ్లారు. ప్రస్తుతానికి ఈ బయోపిక్‌కి బ్రేక్ పడినట్టే. కాని, అందుకు కారణం మాత్రం ఇళయారాజానే అనుకోవాల్సి వస్తోంది.