2024లో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు మంచి ఇమేజ్ వచ్చినా 2024 లో వచ్చిన కల్కి సినిమానే ప్రభాస్ ను వరల్డ్ వైడ్ గా సూపర్ స్టార్ ను చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో అనేది ప్రభాస్ కు ఇప్పుడు చిన్న విషయంగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నాగ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి సినిమా తర్వాత ప్రభాస్ ఫుల్ జోష్ లో కనిపించాడు. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించేసి బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా సవాల్ విసిరింది.
ప్రభాస్ సినిమాల వసూళ్లను అందుకోవడమే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు ఒక టార్గెట్ గా మారిపోయిందనే విషయం నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక 2024లో ప్రభాస్ పేరు ఎక్కువగా మార్మోగిందని చెప్పాలి. దాదాపుగా ఎనిమిది సినిమాలను 2024లో ప్రభాస్ లైన్ లో పెట్టాడు. ఒకటి మారుతీ డైరెక్షన్ లో ది రాజాసాబ్ సినిమా కాగా రెండు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా. మూడు సలార్ 2 ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తుంది. ఇక నాలుగు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్.
అయిదు కల్కి 2, ఆరు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు డైరెక్షన్లో ఒక సినిమా… అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఒక సినిమా ప్రభాస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆరు నెలలకు ఒక సినిమాను టార్గెట్ గా పెట్టుకుని ప్రభాస్ రిలీజ్ చేయాలనుకోవడం చూసి ఇతర స్టార్ హీరోలు కూడా షేక్ అవుతున్నారు. కన్నడ స్టార్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రభాస్ రాబోయే మూడేళ్లలో మూడు సినిమాలు చేయనున్నాడు. దీనికి ఏకంగా 500 కోట్ల బడ్జెట్ ప్రభాస్ కోసమే పక్కన పెట్టింది హోంబులే బ్యానర్.
అలాగే తమిళ్ డైరెక్టర్లు కూడా ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ కావడం ఓ సెన్సేషన్. ప్రభాస్ కూడా ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేయాలని ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉండటం చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు ప్రభాస్ ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేసిన బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు ప్రభాస్ స్పీడ్ చూసి షాక్ అయ్యే పరిస్థితి ఉంది. వచ్చేయేడాది ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రానున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది.
సంక్రాంతి కానుక ఈ రెండు సినిమాల నుంచి మంచి అప్డేట్ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న సినిమా గురించి కూడా మంచి అప్డేట్ రావచ్చని అంచనాలు ఉన్నాయి.