మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు అనేది అతని గత సినిమాలు చూస్తే క్లియర్ గా అర్ధమైనా… పుష్ప సీరీస్ చూసిన తర్వాత అతని రేంజ్ ఏంటీ అనేది యాంటీ ఫ్యాన్స్ కు బొమ్మ కనపడింది. రాజమౌళి సహకారం లేకుండా, అతని సినిమా లేకుండా పాన్ ఇండియా స్టార్ అయిన ఒకే ఒక్క తెలుగు యాక్టర్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో బాలీవుడ్ జనాలకు కూడా ప్రమోషన్ ఏ రేంజ్ లో చేయవచ్చో క్లియర్ గా చూపించేసాడు. అల్లు అర్జున్ దెబ్బకు బాలీవుడ్ కు కూడా చుక్కలు కనపడటం మొదలయింది.
ఇప్పటికే ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ కూసాలు కదిలాయి. ఇప్పుడు పుష్ప 2 దెబ్బకు ఏదైనా జరగవచ్చు. పుష్ప టార్గెట్ వెయ్యి కోట్లు. ఈ టార్గెట్ రీచ్ అయినా అంతకు మించి వసూళ్లు వచ్చినా బాలీవుడ్ ను మర్చిపోవడమే. బాలీవుడ్ కంటే ముందు మెగా ఫ్యాన్స్ కు చుక్కలు కనపడ్డాయి అనే మాట వాస్తవం అంటున్నారు కొందరు అనలిస్ట్ లు. బన్నీ మెగా సపోర్ట్ కోరుకోవడం లేదు. పుష్ప పార్ట్ 1 తోనే పక్కా క్లారిటీ ఇచ్చినా పార్ట్ 2తో మరింత క్లారిటీ ఇచ్చేసాడు. ఇక రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో ద్వారా కూడా జనాలకు పిచ్చ పిచ్చగా క్లారిటీ ఇచ్చాడు.
ఈ షోలో కొన్ని ఫొటోస్ చూపించి… వారి గురించి చెప్పమని బాలయ్య అడిగారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రణబీర్ కపూర్ ఇలా కొందరి ఫొటోస్ చూపించారు. ఆ ఫోటోలో చిరంజీవి గాని రామ్ చరణ్ ఫోటో గాని లేదు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా బన్నీ చాలా తక్కువ మాట్లాడాడు. పవన్ లో ధైర్యం తనకు చాలా నచ్చుతుందని రెండు ముక్కలు చెప్పి ముగించాడు. ఇక చిరంజీవి గురించి కూడా పెద్దగా మాట్లాడింది లేదు. రామ్ చరణ్ టాపిక్ అసలు తెచ్చే ప్రయత్నం చేయలేదు.
ఎవరితో పోటీ అంటే… కనీసం తన ఫ్యామిలీలో ఉన్న హీరోల గురించి చెప్పే ప్రయత్నం చేయలేదు బన్నీ. తన భార్య స్నేహా రెడ్డి వల్లనే తాను ఈ రోజు ఇలా స్టార్ అయ్యాను అంటూ చెప్పాడు గాని… మెగా ఫ్యామిలీ గురించి గాని ఫ్యాన్స్ గురించి గాని పెద్దగా మాట్లాడలేదు. ఎన్నికల ప్రచారం విషయంలో మెగా ఫ్యామిలీతో గ్యాప్ వచ్చినా… ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నం కూడా చేయలేదు. దీనితో హీ డోంట్ నీడ్ అనేది అతను పక్కా క్లారిటీతో చెప్పాడు. మరి పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీని పిలుస్తాడా లేదా అనేది చూడాలి.