వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మించి కొన్ని దేశాల్లో మన సినిమాలు ఆడుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ వరకు ఇండియన్ సినిమాల ప్రభావం ఉంది. ఇటీవల విడుదలైన అన్ని భాషల సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధించాయి. ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు విడుదల కానున్నాయి కూడా. అలాంటిది ఓ దేశంలో ఇండియన్ సినిమాలను కొన్నింటిని విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వం అంగీకరించడం లేదు.
తాజాగా విడుదలైన మూడు సినిమాలను సౌదీ లో బ్యాన్ చేయడం చర్చనీయాంశం అయింది. అసలు ఎందుకు బ్యాన్ చేసారు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. భారతీయ సినిమాలు సింఘం ఎగైన్, భూల్ భూలయ్యా 3 మరియు అమరన్ సౌదీ అరేబియాలో విడుదల కావడం లేదు. ఈ మూడు సినిమాలు దీపావళి కానుకగా విడుదల అవుతున్నాయి. అమరన్ విడుదల కాగా మిగిలిన రెండు సినిమాలు నవంబర్ 1 న విడుదల అవుతున్నాయి. అమరన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గల్ఫ్ దేశాల్లో మన ఇండియన్ సినిమాలు రెగ్యులర్ గా విడుదల అవుతూ ఉంటాయి. అక్కడ భారతీయులు కూడా ఎక్కువగానే ఉన్నారు. వసూళ్లు కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి.
భారతీయ సినిమాల విషయంలో సౌదీ అరేబియా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. జాతీయవాద అంశాలు, మతపరమైన లేదా లైంగిక అంశాలతో కూడిన భారతీయ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. అయితే గల్ఫ్ దేశంలో భారతీయ సినిమాలపై నిషేధం విధించడం ఇదే తొలిసారి కాదు. సినిమాల విడుదలకు ముందు రివ్యూ చేసి… వారి షరతులకు లోబడి సినిమాలు ఉంటే మాత్రమే విడుదల చేస్తున్నారు. వారి స్థానిక ఆచారాలకు విరుద్ధంగా మతపరంగా సున్నితమైన అంశాలు, లైంగిక అంశాలు ఉన్న వాటికి అక్కడి సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వకుండా నిషేధిస్తోంది.
ఈ విధానం కేవలం భారతీయ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాల సినిమాల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సినిమాలు ప్రత్యేకంగా సౌదీ ప్రమాణాలకు అనుగుణంగా ఎడిట్ చేస్తున్నారు. లేదంటే విడుదల ఆపేస్తున్నారు. కాగా మన దేశంలో దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలైయా 3, నవంబర్ 1న అజయ్ దేవగన్-రోహిత్ శెట్టిల సింగం అగైన్ రానున్నాయి. సౌత్ ఇండియాలో శివకార్తికేయన్ నటించిన అమరన్, కవిన్స్ బ్లడీ బెగ్గర్ వంటి తమిళ సినిమాలు విడుదల చేసారు. ఇక తెలుగులో తెలుగు సినిమాలు కూడా క, బఘీరా వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి.