సో ఆల్రెడీ రిలీజ్ కాబోతున్న మూవీ స్టోరీ లైన్ ని రాజమౌళి ఎలా వాడబోతున్నాడనే చర్చ ఒకవైపు జరుగుతోంది. లక్కీగా ఇదే చర్చ వల్ల ఇండియన్ మార్కెట్లో ఇండియానా జోన్స్ కొత్త సీక్వెల్ కి భారీగా ప్రచారం దక్కుతోంది. మొదటి నాలుగు భాగాలు జురాసిక్ ఫేం స్పిల్ బర్గ్ తీస్తే, ఐదో భాగం మాత్రం జేమ్స్ మ్యాన్ తీశాడు.
ఇక గతంలో జేమ్స్ బాండ్ మూవీ తీయాలనుకున్న స్పిల్ బర్గ్ ని నిర్మాతలు అవమానించటంతో, జేమ్స్ బాండ్ ని మించే సాహస వీరుడిని తయారు చేయాలని ఇలా ఈ ప్రాజెక్ట్ ని స్రుష్టించాడు స్పిల్ బర్గ్. రెండో భాగం ఇండియా బ్యాక్ డ్రాప్ లో తీస్తే అందులో బాలీవుడ్ స్టార్ అమ్రిష్ పూరి విలన్ గా చేశాడు. కాని ఈ మూవీ కథ భారత్ ని కించపరిచేలా ఉందని అప్పట్లో వివాదాం కూడా చెలరేగింది.
ఐతే ఇప్పుడు ఐదో సీక్వెల్ ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ వల్ల అమ్రిష్ పూరీ పేరు, హీరో మహేశ్ బాబు పేరు మారుమోగుతోంది. ఇండియానా జోన్స్ 2 లో నటించిన అమ్రిష్ పూరీ ఎప్పుడో చనిపోయాడు. అయినా తన పాత్రని గ్రాఫిక్స్ లో ఇండయానా జోన్స్ 5 లో వాడారట. ఇక ఇదే మూవీ స్టోరీలైన్ తో జక్కన్న సినిమా రాబోతుండటంతో, ఆ మూవీ హీరో మహేశ్ పేరు యూఎస్, యూరప్ మీడియాలో మారుమోగుతోందట. ఇలా ఒక సినిమా ఇందరి పేర్లుమారుమోగేలా చేస్తోంది.