రెబల్ డైనోసార్… 1000 కోట్లలో 100 కోట్ల దానికే…

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్. కథ సిద్దం, కథనం తో పాటు మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది. ఇక మిగిలింది షూటింగ్ మొదలు పెట్టడమే. అందుకు లొకేషన్ల వేటను కూడా మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగ, సైలెంట్ గా స్పిరిట్ మూవీకోసం ఆఫీస్ ని కూడా మొదలు పెట్టాడు.

  • Written By:
  • Publish Date - December 6, 2024 / 06:59 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్. కథ సిద్దం, కథనం తో పాటు మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది. ఇక మిగిలింది షూటింగ్ మొదలు పెట్టడమే. అందుకు లొకేషన్ల వేటను కూడా మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగ, సైలెంట్ గా స్పిరిట్ మూవీకోసం ఆఫీస్ ని కూడా మొదలు పెట్టాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ ని ఎప్పుుడో మొదలు పెట్టిన తను, ఈసారి తన మూవీలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసే మ్యూజీషియన్ కి ఒక పాట ఆఫర్ చేశాడు. యానిమల్ లో రోజా సాంగ్స్ ని రీమిక్స్ చేసిన హర్ష వర్ధన్ రామేశ్వర్, ఈ స్పెషల్ సాంగ్ ని ఆల్రెడీ ట్యూన్ చేయటం, రీమిక్స్ చేయటం రెండు జరిగిపోయాయట. పైసా ఖర్చుకాకుండా ఈ పాటని రికార్డు చేసినా, 100 కోట్లు సమర్పించుకుంటే తప్ప ఆ పాట బయటికి రాదట.. అదెలా? టేకేలుక్ .

రెబల్ స్టార్ ప్రబాస్ ది రాజా సాబ్ షూటింగ్ కథ క్లైమాక్స్ కి చేరింది. వచ్చేనెల 10 తారీఖులోగా అంటే సంక్రాంతికంటే ముందే ది రాజా సాబ్ సాంగ్స్ షూటింగ్ కి యూరప్ లోపూర్తి చేయబోతోంది ఫిల్మ్ టీం. ఈనెల 25 కి టీజర్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇలాంటి టైంలో పిడుగులాంటి మంచివార్తే ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. అదే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో తెరకెక్కబోయే స్పిరిట్ తాలూకు వార్త…

ఆల్రెడీ ది రాజా సాబ్ ని పూర్తి చేసి ఫౌజీ తో బిజీ అవ్వాలనుకుంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తను లేని సీన్లు తెరకెక్కిస్తు డైరెక్టర్ హను రాఘవపూడీ టైం వేస్ట్ చేయట్లేదు. ఇక ఫిబ్రవరి నుంచి ఫౌజీ రెగ్యులర్ షూట్ లో ప్రబాస్ జాయిన్ కాబోతున్నాడు. ఐతే ఈనెల్లోనే స్పిరిట్ ని లాంచ్ చేసేందుకు సందీప్ రెడ్డి సర్వం సిద్దం చేశాడు.

ఐతే 1000 కోట్ల హెవీ బడ్సెట్ తో ప్లాన్ చేస్తున్న ఈసినిమా లో కేవలం ఒకే ఒక్క పాటకోసం 100 కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఆ పాట కంపోజ్ చేయటం మాత్రమే కాదు, రికార్డ్ చేయటం కూడా జరిగిపోయింది.సైలెంట్ గా స్పిరిట్ మూవీ ఆఫీస్ ని మొదలు పెట్టి, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీద హర్షవర్దర్ రామేశ్వర్ తో సిట్టింగ్స్ ఎప్పటినుంచో మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగ, ఒక పాటని కూడా ఫైనల్ చేశాడు

హిందీ పాపులర్ సాంగ్ హవా హవా రీమిక్స్ నే హర్షవర్దన్ రామేశ్వర్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా ఎనిమిది వర్షన్స్ లో రీమిక్స్ చేసిన హర్షవర్దన్ ఫైనల్ గా రెండు వర్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడట. సందీప్ రెడ్డి వంగ నిర్ణయమే ఫైనల్ అవటంతో ఈ రీమిక్స్ సాంగ్ ని మేల్, ఫీమేల్ వర్షన్ ని రెడీ చేశారట. ఇది సినిమాలో రెండు సందర్భాలకోసం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది

ఆల్రెడీ యానిమల్ లో సిక్కుల పాటని ఇలానే రీమిక్స్ చేయించిన సందీప్ రెడ్డి వంగ, రెహమాన్ సాంగ్స్ అయిన రోజా పాటల్ని కూడా హర్షవర్ధన్ తో యానిమల్ లోరీమిక్స్ చేయించాడు. ఇప్పుడు స్పిరిట్ కి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. 600 కోట్ల బడ్జెట్ తో ముందుగా ప్లాన్ చేసి, ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ ని 1000 కోట్లకు పెంచారు. అందులో ఒకే పాటకు 100 కోట్లు సమర్పించటానికి కారణం, హావా సాంగ్ రైట్స్ కే 5 కోట్లు ఇవ్వాల్సి వచ్చిందట. ఇక ఈ పాటని భారీ గ్రాఫిక్స్ తో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో 6 నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఒక్క పాటకి అంత టైం, అంత మనీనా అంటే బయట వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం స్పిరిట్ లో ఈ రీమిక్స్ పాటలో ప్రభాస్ 30 అడుగుల అవతార్ రేంజ్ లుక్ లో కనిపిస్తాడట. ఇది డ్రీమ్ సాంగ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, స్పిరిట్ లో లాఠీ ఛార్జ్ లే కాదు, డైనోసార్ లాంటి సాంగ్స్ ఎటాక్ కూడా ఉంటుందని ఫైనలైంది… ఇదే జరగబోతోంది.సెన్సేషన్ ఏదో జరగబోతోంది.