నేషనల్ డ్యామేజ్ కాదు… ఇది ఇంటర్నేషనల్ డ్యామేజ్…

పాన్ ఇండియా రేంజ్ లో హిట్లైనా, ఫ్లాపులైనా యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ ని తట్టుకోక తప్పదు... సలార్ మీద దాడి చేశారు. అయినా 800 కోట్ల వసూళ్లకు బ్రేకులు పడలేదు. కల్కీ మీద ఏడ్చారు.. వ్యతిరేఖంగా ప్రచారం చేశారు.

  • Written By:
  • Publish Date - December 27, 2024 / 03:09 PM IST

పాన్ ఇండియా రేంజ్ లో హిట్లైనా, ఫ్లాపులైనా యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ ని తట్టుకోక తప్పదు… సలార్ మీద దాడి చేశారు. అయినా 800 కోట్ల వసూళ్లకు బ్రేకులు పడలేదు. కల్కీ మీద ఏడ్చారు.. వ్యతిరేఖంగా ప్రచారం చేశారు. అయినా 1200 కోట్ల వరదకి బ్రేక్ పడలేదు. దేవరనైతే దేశవ్యాప్తంగా యాంటీ ఫ్యాన్స్ తెగ ఆడుకున్నారు. ట్రోల్ చేశారు. ప్రతీ విషయాన్ని రచ్చ చేశారు. ఐనా510 నుంచి 670 కోట్ల వరకు దేవర దూకుడు తగ్గలేదు. అసలు వసూళ్ల జర్నీకి ఎక్కడా బ్రేకులు పడలేదు. విచిత్రం ఏంటంటే ఈ ఏడాది విమర్శలు ఎదుర్కోని మూవీ లేదు. ఐనా విజయం దక్కింది. కాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 కి 1600 కోట్ల వసూళ్లొచ్చినా, ఎవరూ రిపేర్ చేయలేని డ్యామేజ్ జరిగింది. అసలే ఆ కలెక్షన్స్ మీద సవా లక్ష అనుమానాలు ఉన్నాయంటుంటే, ఇలాంటి టైంలో సంధ్య థియేటర్ కేసుతో సీన్ రివర్స్ అయ్యింది. ఐకాన్ స్టార్ కి నేషనల్ లెవల్లో కాదు ఇంటర్ నేషనల్ లెవల్లో డ్యామేజీ జరిగిపోయింది.

పుష్ప రాజ్ అంటే నేషనల్ అనుకుంటివా కాదు.. ఇంటర్ నేషనల్ అంన్నాడు ఐకాన్ స్టార్… అచ్చంగా ఇప్పుడు పుష్ప2 సంధ్య థియేటర్ ఇష్యూ నేషనల్ లెవల్లో కాదు ఇంటర్ నేషనల్ లెవల్లో డ్యామేజ్ అవుతోంది. అయ్యింది కూడా. నిజానికి వివాదం లేకుండా ఈ ఏడాది ఏ మూవీ రాలేదు. ట్రోలింగ్స్ కి , కామెంట్స్ కి గురి కాని సినిమా ఈఏడాదే లేదు…

సలార్ 800 కోట్ల వసూళ్ళ రాబట్టినా విమర్శలు ఆగలేదు. కల్కీ ని అయితే ట్రోలర్స్ ఓ ఆట ఆడుకున్నారు. సరే నార్త్ లో కొంతమంది కుళ్లు బ్యాచ్ మన హీరోల మీద, మనమూవీల మీద ఇలా బురద చల్లుతున్నారే అనుకున్నా, ఎవరెంత కుళ్లకున్నా కలెక్షన్లు ఆగలేదు. కల్కీకి 1200 కోట్లొచ్చాయి. దేవరకి 510నుంచి 670 కోట్లొచ్చాయి.పుష్ప2 కి 1600 కోట్లు దాటాయి..

ఇక్కడ టాపిక్ వసూళ్లు కాదు… వాటి వెనకున్న విమర్శలు… సలార్, కల్కీ, దేవరకి యాంటీ ఫ్యాన్స్ నుంచి కుళ్లకు బ్యాచ్ వరకు చాలా మంది వీటి మీద కామెంట్ల దాడి చేశారు. ట్రోలింగ్ చేశారు.. కాని ఎక్కడా వసూల్ల మీద డౌట్లు రాలేదు. కలెక్షన్ల నెంబర్స్ ని క్వశ్చన్ చేయలేదు. ఓన్లీ పుష్ప2 వసూళ్ల లెక్కల మీదే డౌట్లు, కామెంట్లు వచ్చాయి. అలాంటి టైంలో ఇదో సినీ సునామీ అని ఫిల్మ్ టీం చెప్పుకుంటున్న సమయంలో, సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ జరిగింది

ఇక అక్కడి నుంచి వరుసగా పాన్ ఇండియా లెవల్లో డ్యామేజ్ షురూ అయ్యింది. బన్నీ ఇన్ హ్యూమన్ అనిపించేలా, తన యాటిట్యూడ్, అబద్దాలు ఇవన్నీ సోసల్ మీడియాలో వైరలయ్యాయన్నారు. చాలా మంది కామెంట్లతో దాడి చేశారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇంటర్ నేషనల్ స్థాయిలో పుష్ప కు డ్యామేజ్ జరిగేలా ఉంది.

ఎందుకంటే ఓ సినిమా చూడ్డానికొచ్చి ఇలా జనాలసంధోహం వల్ల ఓ వ్యక్తి చనిపోవటమే, మెల్లిగా సోషల్ మీడియా రూపంలో వరల్డ్ వైడ్ గా చక్కర్లు కొడుతోంది. ఇక బన్నీ మాటలు, అందులోని అబద్దాలంటూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో కంపైల్ చేసి పెడుతున్నారట. దాంతో ఇప్పుడు పుష్ప రాజ్ నేషనల్ కాదు ఇంటర్ నేషనల్ లెవల్లో డ్యామేజ్ జరిగిపోతోంది. కెరీర్ మొత్తం ఇదో మాయని మచ్చలా మారేలా ఉంది.