Allu Arjun: ఈ ఏడాది జనవరిలో విడుదలైన పఠాన్ మూవీ బాలీవుడ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇంతటి ఘన విజయం తర్వాత బాలీవుడ్ కింగ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్. షారూక్‌ఖాన్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా జవాన్.
ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదే చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నాడని. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్లో బన్నీ కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా వున్న ఐకాన్ స్టార్ హిందీలో జవాన్‌తో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం మొదలైంది. ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ కోసం అట్లీ అల్లు అర్జున్ను సంప్రదించి కథను కూడా వినిపించాడని, కథ నచ్చిన బన్నీ ఈ మూవీలో నటిస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. ఆల్రెడీ షూట్లో పాల్గొన్నాడని.. టీజర్లో బన్నీ కనిపిస్తాడంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. అయితే, ఈ కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదట.
బన్సీ అసలు జవాన్ షూటింగ్‌లోనే పాల్గొనలేదని తెలుస్తోంది. హిందీలో డెబ్యూ మూవీలోనే షారూక్‌తో నటించే అవకాశం వచ్చినా బన్నీ వద్దనుకున్నాడట. పుష్ప-2తో బిజీగా వుండడం ఒక కారణమైతే, తను చేయదగ్గ క్యారెక్టర్ కాకపోవడంతోనే లైట్ తీసుకున్నాడు బన్నీ. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’లోని సాంగ్‌లో రామ్‌చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ వీడియో రిలీజ్ కాగానే.. జవాన్‌లో బన్నీ అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. రామ్‌చరణ్ నుంచి అప్డేట్ రాగానే.. బన్నీ నుంచి ఏదో ఒక న్యూస్ రావాల్సిందే అనేలా తయారైంది పరిస్థితి. ఇలా టాలీవుడ్లో కోల్డ్ వార్ నడవడంతో గాసిప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. పుష్ప-2 టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో వున్నారు.
టైటిల్ చూస్తుంటే.. పుష్ప-2కు, చైనాకు సంబంధం వుందా? టైటిల్‌ను డ్రాగన్స్‌తో డిజైన్ చేసిన నేపథ్యంలో సినిమాను చైనాలో కూడా రిలీజ్ చేస్తున్నారా? అందుకే చైనీస్‌ను ఎట్రాక్ట్ చేయడానికి ఇలా చేశారా అనిపిస్తోంది. ఎర్ర చందనంకు చైనాలో మంచి డిమాండ్ వుండడంతో… పుష్ప-2 ను అక్కడ రిలీజ్ చేసే ప్లాన్‌లో వున్నారట మేకర్స్. ఈలెక్కన ముందుగా పుష్పను చైనాలో రిలీజ్ చేసి పుష్ప2పై అక్కడా హైప్ క్రియేట్ చేసే పనిలో వుందట చిత్ర యూనిట్.