టాలీవుడ్ కి ఒకే ఒక్క మెగా స్టార్ చిరంజీవి. తను రాజకీయాల్లోకి వెల్లినా ఆ ప్లేస్ ఎవరూ రిప్లేస్ చేయలేదు. పవన్, మహేశ్ ఎవరిని అడిగాన నో బడి కెన్ రిప్లేస్ హిమ్ అన్నారు. కాని ఇప్పుడు సీన్ చూస్తే ఇంకా చిరునే టాలీవుడ్ మెగాస్టారా అన్న డౌట్లొస్తున్నాయి.
గాడ్ ఫాదర్ కి 50 కోట్లు, వాల్తేర్ వీరయ్యకి 55 కోట్లు భోళా శంకర్ కి 65 కోట్లు అంటూ రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోయిన చిరు, వసూళ్లను రాబట్టడంలో మాత్రం తడబడుతున్నాడు. తన సినిమాలేవీ వందలకోట్లు రాబట్టలేకపోతున్నాయి. పవన్, మహశ్, ప్రభాస్ సినిమాలకొచ్చే వసూళ్లతో పోలిస్తే చిరు కిలో మీటర్ల కొద్ది ఎక్కడో దూరంగా ఉండిపోయాడు.
మరి మార్కెట్ లో బీట్ లేదు, వందలకోట్ల వరద లేదు.. సో ఇంకా మెగాస్టార్ అంటే ఎలా అన్న ప్రశ్న ఎదురౌతుంది. బడా స్టార్లంటే క్రౌడ్ పుల్లర్లు… హిట్లు లేనంత మాత్రాన, వసూల్లు రానంత మాత్రానా చిరు మెగాస్టార్ కాకుండా పోతాడని అనుకోలేం. ఆయన చరిత్ర గొప్పది, స్టామినా కూడా గొప్పదే. కాని క్రేజ్, మార్కెట్ లోమైలేజు, తన పెర్ఫామెన్స్ లో గ్రేసు తగ్గుతున్నాయి.. అందుకే ఏం చూసి ఇంకా టాలీవుడ్ కి మెగాస్టార్ చిరునే అనుకోవాలన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి..