Devara’s movie : దేవర సినిమా లేట్‌ అవ్వడానికి అతనే కారణమా?

తారక్‌ ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర (Devara) సినిమా అంతకంతకూ లేట్‌ అవుతూనే ఉంది. ఏపీ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉంటాయని.. ఏప్రిల్‌ 5న దేవర విడుదలైతే.. ఆ ఎఫెక్ట్‌ సినిమాపై పడుతుందంటున్నారు మేకర్స్‌. ప్రస్తతుం ఎన్టీఆర్‌ పొలిటికల్‌గా ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేయడంతో.. ఏప్రిల్‌కు సినిమా రాకపోవడమే మంచిదన్న ఫీలింగ్‌లో తారక్‌ ఫ్యాన్స్‌ (Tarak Fans) కూడా ఉన్నారు.

 

 

 

తారక్‌ ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర (Devara) సినిమా అంతకంతకూ లేట్‌ అవుతూనే ఉంది. ఏపీ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉంటాయని.. ఏప్రిల్‌ 5న దేవర విడుదలైతే.. ఆ ఎఫెక్ట్‌ సినిమాపై పడుతుందంటున్నారు మేకర్స్‌. ప్రస్తతుం ఎన్టీఆర్‌ పొలిటికల్‌గా ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేయడంతో.. ఏప్రిల్‌కు సినిమా రాకపోవడమే మంచిదన్న ఫీలింగ్‌లో తారక్‌ ఫ్యాన్స్‌ (Tarak Fans) కూడా ఉన్నారు. ఇలా దేవరను చాలా విషయాలు ఇబ్బంది పెడుతున్నాయట. ఏప్రిల్‌ 5న రావాల్సిన దేవర ఎందుకు వాయిదా పడిందంటే.. ఎన్నికలు కారణంగా అని చెబుతున్నారు. కానీ.. ఇదొక్కటే రీజన్‌ కాదు. చాలా ఫ్యాక్టర్స్‌ దేవరను పోస్ట్‌ఫోన్‌ అయ్యేలా చేశాయా? ముఖ్యంగా బడ్జెట్ అంచనాలను దాటిపోయింది. దీంతో సినిమాను రెండు పార్టులుగా తీయాల్సి వస్తోంది.

‌ఇంకా బ్యాలెన్స్‌ వున్న 20-30 పర్సెంట్‌ షూటింగ్‌ పూర్తికావాలంటే నెల రోజులు పడుతుందట. దేవర కోసం.. ఎన్టీఆర్‌ ఏరి కోరి అనిరుధ్‌ (Anirudh) ను రికమెండ్‌ చేశాడు. చేతినిండా సినిమాలతో వున్న అనిరుధ్‌.. దేవరకు అనుకున్న టైంలో ట్యూన్స్‌ ఇవ్వలేకపోతున్నాడు. 2023లోనే నాలుగు పాటలు ఇవ్వాల్సి వున్నా.. ఇంతవరకు ఒక్కపాటను కూడా రికార్డ్‌ చేయలేకపోయాడు. దేవరకు సంబంధించి కీ సీన్స్‌ అన్నీ తీసేశారు. ఒకట్రెండు టాకీ పార్టులు తప్ప అంతా పూర్తయింది. సినిమా మొదలై ఏడాది దాటినా.. ఎన్టీఆర్‌, జాన్వి కపూర్‌ ఇంతవరకు పాటల జోలికి పోలేదు. ఎందుకంటే.. అనిరుధ్‌ ట్యూన్స్‌ ఇవ్వకపోవడంతో నాలుగు పాటలు తీయడం ఆగిపోయాయి. అనిరుధ్‌ దయ దేవర ప్రాప్తం అన్నట్టు మ్యూజిక్‌ అయిపోయింది.