Game Changer : ‘గేమ్ ఛేంజర్’ కష్టమేనా

గత రెండు మూడేళ్లుగా.. గేమ్ చేంజర్ విషయంలో చర్చ జరుగుతునే ఉంది. రోజు రోజుకి శంకర్ ఈ సినిమా షూటింగ్‌ను డిలే చేస్తునే ఉన్నాడు. ఇండియన్ 2 (Indian 2) కారణంగా గేమ్ చేంజర్ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు.

గత రెండు మూడేళ్లుగా.. గేమ్ చేంజర్ విషయంలో చర్చ జరుగుతునే ఉంది. రోజు రోజుకి శంకర్ ఈ సినిమా షూటింగ్‌ను డిలే చేస్తునే ఉన్నాడు. ఇండియన్ 2 (Indian 2) కారణంగా గేమ్ చేంజర్ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్టుగా వార్తలు వస్తునే ఉన్నాయి. దీంతో.. మహా అయితే మరో నెల రోజులకు అటు ఇటుగా గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఇంకా చాలా షూటింగ్‌ని పూర్తి చేయాల్సి ఉందట.

మరో 45 రోజుల షూటింగ్ చేస్తే గానీ గుమ్మడి కాయ కొట్టలేరట. నెలన్నర రోజులు అంటే చాలా సమయం అని చెప్పాలి. ఈ షెడ్యూల్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారనే విషయంలో కూడా క్లారిటీ లేదు. పైగా జూన్, జూలైలో ఇండియన్ 2 రిలీజ్ అంటున్నారు కాబట్టి.. మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో.. అసలు గేమ్ చేంజర్ (Game Changer) షూటింగ్‌కు ఇంకెన్ని రోజులు పడుతుందో ఖచ్చితంగా చెప్పలేం. కానీ దిల్ రాజు మాత్రం అక్టోబర్, నవంబర్‌లో సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు మాత్రం 45 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ అనేసరికి.. ఈ ఏడాదిలో కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కష్టమే అంటున్నారు. రామ్ చరణ్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న ఈ మూవీలో.. రామ్ చరణ్‌ (Ram Charan) సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. తమgన్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్‌గా జరగండి సాంగ్ రిలీజ్ అవగా చార్ట్ బస్టర్‌గా నిలిచింది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.