గత కొన్నాళ్ళుగా వార్తల్లో లేని మెగా వారి కోడలు లావణ్య త్రిపాఠి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. సినిమా వాళ్ళ గురించి ఏదైనా క్లూ దొరికితే చాలు అల్లుకుపోయే సోషల్ మీడియా జనాలకు మంచి విందు భోజనం లాంటి సిగ్నల్స్ ఇచ్చింది లావణ్య. గత ఏడాది నవంబర్ లో పెళ్లి చేసుకున్న లావణ్య ఇప్పుడు ఏ సినిమాలో నటించడం లేదు. హ్యాపీ బర్త్ డే సినిమా లావణ్య ఆఖరి సినిమా… ఆ తర్వాత ఆమె ఒకటి రెండు వెబ్ సీరీస్ లు, టీవీ షోస్ లో మాత్రమే కనపడింది గాని సినిమాలకు మాత్రం సైన్ చేయలేదు.
దానికి కారణం ఏమై ఉండవచ్చు…? కారణం ఆమె ప్రెగ్నెంట్ కావడమే అంటున్నాయి తాజాగా బయటకు వచ్చిన కొన్ని వీడియోలు అలాగే ఫోటోలు. తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి తిరుమల దర్శనానికి వెళ్ళిన లావణ్య ఫోటోలు బయటకు వచ్చాయి. అలాగే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఆమె తన పొట్టను కవర్ చేస్తూ కనిపించారు. ఫొటోస్ లో కూడా చాలా జాగ్రత్తగా కనపడింది లావణ్య. తాను ధరించిన చీరతో పొట్టను కవర్ చేస్తూ నడుస్తున్న వీడియో చూసిన జనాలు కచ్చితంగా ఆమె ప్రెగ్నెంట్ అంటున్నారు.
సినిమాల్లో నటించకపోవడానికి కారణం అదే అంటున్నారు. అయితే ఈ విషయాన్ని లావణ్య గాని ఆమె కుటుంబం గాని బయట పెట్టలేదు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని… ఈ ఫోటోలు, వీడియోలు చూసిన వాళ్ళు అయితే ఆమె ముఖంలో మార్పులు, ఆమె నడుస్తున్న విధానం, చీరతో కవర్ చేసుకుంటున్న పద్ధతి చూసి… కచ్చితంగా లావణ్య సం థింగ్ సం థింగ్ అంటూ గుస గుసలాడుతున్నారు. ఈ రూమర్లపై మెగా ఫ్యామిలీ నుంచి ఏ స్పందన వస్తుందో చూడాలి. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య గత 18 రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా లేరు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.