పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్‌పై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నానని ఆయనే చెప్పడంతో పొలిటికల్‌గా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇంత వివాదంలో పవన్ తన రెమ్యునరేషన్ని పెంచేయడం షాక్ ఇస్తోంది. ఓజీ సినిమాకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఈ జోరు చూస్తే సినిమాకి 100 కోట్ల కి వెళ్లిపోతాడేమో అనిపిస్తుంది.
పవన్ ఈమధ్య తన రెమ్యునరేషన్ గురించే కాదు.. స్టార్స్ తీసుకునే పారితోషికంపైన కూడా మాట్లాడుతున్నాడు. మహేశ్.. ప్రభాస్ తనకంటే పెద్ద హీరోలని.. తనకంటే ఎక్కువ తీసుకుంటున్నారని వారాహి యాత్రలో కామెంట్స్ చేశాడు. స్టార్స్ అంటే తనకు గౌరవమని.. వాళ్ల అభిమాలను తనకు అండగా నిలవాలని కోరారు పవన్‌స్టార్. పార్టీని నడపడం కోసమే సినిమాల్లో నటిస్తున్నానని.. చెప్పిన పవన్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఆమధ్య ఓ మీటింగ్‌లో అయితే.. బ్రో సినిమాకు రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. అప్పట్నుంచీ పవన్ రెమ్యునరేషన్ పొలిటికల్ టాపిక్‌గా మారింది. అజ్ఞాతవాసి తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ వకీల్‌సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమాకు 40 కోట్లు తీసుకున్నాడన్న టాక్ అప్పట్లో నడిచింది. ఆ తర్వాత 50.. ప్రస్తుతం 60 కోట్లకు రెమ్యునరేషన్ చేరింది. ప్రస్తుతం నటిస్తున్న ఓజీ కి 80 కోట్లు తీసుకుంటున్నాడని సినీవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్, సాహో ఫేం సుజిత్ కాంబోలో రూపొందుతున్న సినిమా ‘ఓజీ’. సినిమాను ఒక పార్టుగా మొదలుపెడితే.. బాహుబలి.. సలార్ మాదిరి రెండు పార్టులవుతోంది. ఒక్కోపార్ట్‌కు 80 కోట్లు తీసుకుంటున్నాడా?
పవన్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. ఓజీ.. ఉస్తాద్ భగత్‌సింగ్‌తోపాటు.. మూడేళ్ల క్రితం ప్రారంభమైన హరిహర వీరమల్లు లైన్లో వుంది. బ్రో రిలీజ్ తర్వాత ఓజీని పూర్తి చేసి డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారనుకుంటే.. పవన్ మూడు నెలలుగా షూటింగ్‌లోకి అడుగుపెట్టలేదు. డేట్స్ ఎప్పుడు ఇస్తాడో తెలీదు. ఒకవేళ ఇచ్చినా.. కాంబినేషన్స్ సెట్ కావాలి. నటీనటులందరూ డేట్స్ ఇస్తేనే.. సినిమా మొదలవుతుంది. దీనికి తోడు.. ఓజీని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారన్న చర్చ నడుస్తోంది. పవన్ ఒక్క పార్ట్‌ను పూర్తి చేయడం కష్టం. దీనికి తోడు రెండు పార్టులా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఓజీ బడ్జెట్ అనుకున్న దానికంటే బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. రెండు పార్టులుగా తీస్తేనే వర్కవుట్ అవుతుందట. అందులోనూ.. ఫస్ట్ పార్ట్‌లో పవన్ 45 నిమిషాలపాటే కనిపిస్తాడని.. రెండోపార్ట్‌కు లీడ్ ఇచ్చేలా ఎండింగ్ వుంటుందంటున్నారు మేకర్స్.
ఓజీ రెండు భాగాలైతే.. రెమ్యునరేషన్ ఒక్కోపార్ట్‌కు 80 కోట్లు వుంటుందన్నది తాజా అంశం. ఈమధ్యకాలంలో అదిరిపోయే హిట్ లేని పవన్‌కు 80 కోట్లా? అన్న టాపిక్ కూడా నడుస్తోంది. బ్రో రిజల్ట్ ఎలా వున్నా.. సినిమాలో పవన్ లేకపోతే.. 90 కోట్లకు బిజినెస్ అయ్యేదా? అసలు 70 కోట్లు వచ్చేదే కాదు. పవన్ నుంచి అదిరిపోయే హిట్ పడితే.. ఆయనకు ఇచ్చే రెమ్యునరేషన్ లెక్కలోకి రాదు. సక్సెస్ లేకపోవడంతోనే.. ఆయన రెమ్యునరేషన్‌పై చర్చ నడుస్తోంది. డేట్స్ ఇవ్వకుండా.. ఒక్కో సినిమాను సంవత్సరాలపాటు సాగదీయడంతో.. నిర్మాతలకు వడ్డీభారంతోపాటు.. బడ్జెట్ పెరిగిపోతోంది. ఈ రీజన్‌తోనే.. ఓజీ కాస్ట్‌ను రెండు పార్టులతో కట్ చేయాలన్న ఆలోచన మొదలైందా అనిపిస్తోంది.