పాన్ ఇండియా (Pan India) రెబల్ స్టార్ (Rebel Star) హీరోగా గతేడాది విడుదలైన సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.. హై ఎక్స్పెక్టేషన్స్ నడుమ వచ్చిన ఈ మూవీ దేశమంతటా మాత్రమే కాకుండా ఓవర్సీస్లోనూ పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు పార్ట్-2 కోసం వరల్డ్ వైడ్ (World wide) ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.. శౌర్యంగ పర్వంగా రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ కోసం కళ్లు కాయలు కాచేలాఎదురు చూస్తున్నారు.. రెండో భాగంలో రెబల్ స్టార్ అసలైన ఎలివేషన్స్ ఉంటాయంటూ లీక్స రావడంతో రెండో భాగం గురించి అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి.. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సలార్-2’ (Salaar 2) షూటింగ్ కు సంబంధించి ఓ లేటెస్ట్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది.
సలార్-2లో, కథ మొత్తం రాజకీయం నేపథ్యంలో కొనసాగుతుందట. ప్రభాస్, పృథ్వీరాజ్ (Prithviraj) లు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చిందనే అంశంపైనే చిత్రం పూర్తిగా ఉంటుందట.. అసలైన కథ మొదలయ్యే పార్ట్ 2లో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య పోరాట సన్నివేశాలు ఉండనున్నాయి. ఎన్నో సస్పెన్స్‌లతో ముగించిన సలార్ పార్ట్-1కు ఈ సీక్వెల్లో సమాధానాలు దొరకున్నాయని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ‘శౌర్యంగ పర్వం’లో ప్రభాస్ యాక్షన్ సీన్స్, వైలెన్స్ ఎక్కువగా ఉంటాయని మేకర్స్ తెలిపిన నేపథ్యంలో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.. అయితే.. హీరో ప్రభాస్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని, అందుకే సిినిమా షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ రీజన్‌తోనే సలార్- 2 షూటింగ్‌ని ప్రభాస్ తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.. అయితే.. వీటన్నింటికీ మూవీ టీమ్ చెక్ పెట్టింది.
సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సెట్స్‌లో ప్రభాస్- ప్రశాంత్ నీల్ నవ్వుతూ కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు ‘వారు నవ్వకుండా ఉండలేరు’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో.. ప్రభాస్-నీల్‌పై వస్తున్న రూమర్స్‌ను ఇన్‌డైరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చినట్లైంది. ఇక లేటెస్ట్ అప్డేట్తో రూమర్లకు చెక్ పడినట్టైందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సలార్-2ను పట్టాలెక్కించాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.