ఆస్కార్ విన్నింగ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్… తన భార్యకు విడాకులు ఇచ్చిన అంశం ఇండియన్ సినిమాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ ఎందుకు విడిపోయారు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ ఇద్దరూ. కలపడానికి ఎంత మంది ప్రయత్నం చేసినా సరే సాధ్యం కాలేదని… ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అంతరాన్ని తగ్గించలేకనే విడిపోతున్నారని… సైరా భాను తరుపు లాయర్ వందనా షా ప్రకటించారు.
దీనితో అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అనే దానిపై సినిమా పెద్దలు కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఇద్దరి మనస్పర్ధలు ఏంటీ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఈ టైం లో ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ ను షేక్ చేస్తోంది. ఏఆర్ రహమాన్ వద్ద పని చేసే ఓ అమ్మాయి కూడా తన భర్తకు డైవర్స్ ఇచ్చింది. ఏఆర్ రహమాన్ వద్ద వర్క్ చేస్తున్న మోహిని డే 2011లో 15 సంవత్సరాల వయస్సులో రెహమాన్‌తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. రాక్‌స్టార్, హైవే, తమాషా సినిమాలతో సహా మరో 99 హిట్ పాటలకు… ఆమె గిటార్ వాయించింది.
ఆమె రెహమాన్‌తో కలిసి అతని కచేరీలలో కూడా కలిసి పాల్గొంది. 1996లో జన్మించిన మోహిని డే తన 11వ ఏటనే తన గిటార్‌తో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించి, ఇండియాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా బాసిస్ట్ గా పేరు పాపులర్ అయింది. గత దశాబ్ద కాలంలో, మోహిని డే బాగా ఫేమస్ అయింది. గిటార్ గురు స్టీవ్ వై, ఏస్ డ్రమ్మర్ మార్కో మిన్నెమాన్, జాకీర్ హుస్సేన్, సింగర్ విల్లో స్మిత్‌తో సహా అనేక మంది ప్రపంచ సంగీత కళాకారులతో కలిసి వర్క్ చేసింది ఆమె. కాని ఏఆర్ రహమాన్ తో ప్రయాణం మాత్రం ఆపలేదు.
అలాంటి మోహినీ డే… మంగళవారం, తన భర్త, అమెరికన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన… మార్క్ హార్ట్ సుచ్ నుండి విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. 2021లో వీరికి వివాహం జరిగింది. ఎన్నో సాంగ్స్ కు ఇద్దరూ కలిసి వర్క్ కూడా చేసారు. ఏఆర్ రహమాన్ డైవర్స్ తీసుకున్న రోజునే ఆమె కూడా డైవర్స్ తీసుకోవడం వెనుక కారణం ఎమై ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జల్లెడ పడుతున్నారు. ఆమె కారణంగా ఏమైనా విభేదాలు వచ్చాయా…? మోహిని డే విడాకులకు రహమాన్ కు ఏమైనా లింక్ ఉందా అంటూ జుట్టు పీక్కుంటున్నారు నెటిజన్లు…