సలార్ (Salaar) తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్ (Prabhas)… నెక్స్ట్ కల్కి 2898 ఏడి (Kalki 2898AD) తో రాబోతున్నాడు.. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది.. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్‌గా రాబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్.. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలె సంక్రాంతికి అనౌన్స్ చేయగా.. రాజా సాబ్‌గా డార్లింగ్ లుక్.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది.. వింటేజ్ ప్రభాస్ (Prabhas) మాస్ లుక్‌కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.. ఇప్పటికే సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్.. ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.. అయితే.. చాలా రోజుల తర్వాత ప్రభాస్ అసలు సిసలైన తెలుగు నేటివిటీ సినిమాతో వస్తుండడంతో..
ఈ సినిమా హైప్‌ను రీచ్ అవ్వడం మారుతీకి అసలైన ఛాలెంజ్ అంటున్నారు సినీ విశ్లేషకులు..
రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని రూమర్లు వస్తున్నాయి.. నిజానికి బాహుబలి సిరీస్ సినిమాల తరువాత ప్రభాస్ నుండి ఆ స్థాయి మంచి కమర్షియల్ మూవీ రాలేదు.. దీంతో.. అసలు సిసలైన అచ్చ తెలుగు ప్రభాస్ కోసం డార్లింగ్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ టైమ్‌లో ఫ్యాన్స్ ఎదురు చూపులకు చెక్ పెడుతూ.. రాజా సాబ్‌గా ప్రభాస్‌ను దింపేశాడు మారుతీ.. చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ రోల్ చేస్తున్నాడు డార్లింగ్..దీంతో.. కల్కి, సలార్-2 వంటి భారీ సినిమాలకన్నా.. రాజా సాబ్ సినిమాపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..
ఇక ఇటీవల రాజా సాబ్ గురించి మారుతీ మాట్లాడుతూ, ప్రభాస్ నుండి ఫ్యాన్స్, ఆడియన్స్ ఆశించే మంచి కమర్షియల్ అంశాలు అన్ని మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.. మారుతి చెప్పినట్లుగానే పంచెకట్టులో కనిపించిన ప్రభాస్ లుక్.. సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఓ రేంజ్‌లో పెంచేసింది.. బాహుబలి నుంచి ప్రభాస్ ప్రతి మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతోంది.. కాబట్టి, తెలుగుతో పాటు అన్ని భాషల ఆడియన్స్ ని మారుతీ మెప్పించాలి., మరి.. ఇది మారుతీకి కొంచెం కత్తి మీద సాములాంటిదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. మరి.. మారుతీ ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అయ్యి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాల్సిందే..