చిత్రలో ఈ యాంగిల్ కూడానా…? డైరెక్టర్ ఫిదా అంతే…!

దృశ్యం... భారత చలన చిత్ర పరిశ్రమలో ఇదొక అద్భుతం. అవును నిజంగా అద్భుతమైన సినిమానే దృశ్యం. హాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఏకైక సినిమా ఇది. ఏ భాషలో విడుదలైనా సరే సూపర్ హిట్ అయిన సినిమా ఇది. కొన్ని సినిమాలు ఎప్పుడు టీవీ లో వచ్చినా జనాలకు ఒక పిచ్చి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 09:00 PM IST

దృశ్యం… భారత చలన చిత్ర పరిశ్రమలో ఇదొక అద్భుతం. అవును నిజంగా అద్భుతమైన సినిమానే దృశ్యం. హాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఏకైక సినిమా ఇది. ఏ భాషలో విడుదలైనా సరే సూపర్ హిట్ అయిన సినిమా ఇది. కొన్ని సినిమాలు ఎప్పుడు టీవీ లో వచ్చినా జనాలకు ఒక పిచ్చి ఉంటుంది. సినిమా అలా వస్తుంటే ఇలా నిలబడిపోయి చూస్తూ ఉంటారు జనాలు. ఒక్కో సీన్ ఒక్కో షాట్ మతిపోగోడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా మూడో పార్ట్ వచ్చేస్తుంది. రెండు పార్ట్ లకు మంచి స్పందన వచ్చింది.

స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తే అక్కడ కూడా సూపర్ సక్సెస్ కావడంతో పార్ట్ 3 కోసం జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. మలయాళంలో మొదలైన ఈ సీరీస్ కు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు పార్ట్ 3 ని మలయాళంలో షూటింగ్ మొదలుపెడుతున్నారు. అక్కడ మోహన్ లాల్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పార్ట్ 2 లో కొన్ని సమస్యలు ఎదురుకావడంతో సినిమా కాస్త ఆలస్యం అయింది. కొన్ని సీన్లు ఆకట్టుకోలేదు అనే విమర్శ కూడా వినిపించింది. అందుకే ఇప్పుడు మూడో పార్ట్ పై దర్శకుడు సీరియస్ గా ఫోకస్ పెట్టారు.

దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ… తన మనసు అంతా ఇప్పుడు ఈ సినిమాపైనే ఉందన్నాడు. సెకండ్ పార్ట్ లో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో అవి రిపీట్ కావోద్దని కథలో కొన్ని మార్పులు కూడా చేసుకున్నాను. క్లైమాక్స్ సీన్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మోహన్ లాల్ కు వివరించడంతో ఆయన కూడా ఓకే చేప్పెసారట. ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ గాయని చిత్ర ఇచ్చిన సలహాలు ఎంతగానో నచ్చాయని, సినిమా ఓపెనింగ్ ఎలా ఉండాలో ఆమె చాలా మంచి ఐడియా ఇచ్చారని చెప్పాడు దర్శకుడు. అందుకు తగిన విధంగా మార్పులు చేసుకున్నట్టుగా చెప్పాడు.