అనిల్ సుంకర అనగానే టాలీవుడ్ నెంబర్ వన్ బకరా అంటున్నారు. మంచి నిర్మాత, కథని నమ్మితే కోట్లు కుమ్మరించే ప్రొడ్యూసర్. అలాంటి తనను అంతా ముంచేస్తున్నారా? మొన్న అఖిల్ మూవీ ఏజెంట్ కి 40 కోట్లనుకుని 80 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. సురేందర్ రెడ్డి పనికిమాలిన స్ట్రాటజీతో బడ్జెట్ తడిసి మోపెడైందన్నారు.
తన తప్పుతో అనిల్ సుంకర మునిగిపోయాడన్నారు. ఏజెంట్ ఫ్లాప్ అవటం మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ల కోర్టుకెల్లి తమకు న్యాయం చేయాలనేంత వరకు సీన్ పోయింది. సరే చిరంజీవి మూవీతో గట్టెక్కుతాడానుకుంటే, పోయి పోయి, మోహార్ రమేష్ మేకింగ్ లో భోళా శంకర్ ని నిర్మించాల్సి వచ్చింది.
శక్తి తో ఎన్టీఆర్ ని షాడోతో వెంకటేష్ ని కోలుకోలేకుండా చేసిన మోహర్ రమేష్ భోళా శంకర్ తో చిరంజీవికి తన కెరీర్ లో మరిచిపోలేని డిజాస్టర్ ని ఇచ్చాడు. సరే హీరో ఎలాగోలా తట్టుకుంటాడు కాని, నిర్మాత పరిస్తితేంటి? చిరు తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినా కూడా భోళా శంకర్ డిజాస్టర్ నుంచి అనిల్ ని కాపాడలేడంటున్నారు.
ఎందుకంటే రిలీజ్ కి ముందు నైజాం రైట్స్ ఎవరూ కొనటానికి ముందుకు రాకపోతే సొంతంగా రిలీజ్ చేసే వరకు వెళ్లారు. చివర్లో రేటు తగ్గించారు.. ఇన్ని జరిగాయి. కట్ చేస్తే మొదటి రోజు కాదు, మొదటి ఆటకే సినిమా అటకెక్కింది. సో లాంగ్ రన్ లో 20, 30 కోట్లు రావటం కష్టమే. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోర్టు కేసువల్ల చేతికి ఇప్పడే రావు. సో అనిల్ సుంకరీ రెండోసారి కూడా ఏజెంట్ మూవీ తర్వాత మునిగాడనంటున్నారు.