Trisha Krishnan: కోలీవుడ్ పొన్ను త్రిషకి ఎన్నిసార్లు పెళ్లి చేస్తారు..?

21 ఏళ్ల కెరీర్‌లో త్రిష కెరీర‌కి మూడుసార్లు ఎండ్ కార్డ్ పడింది. ఇక తను సినిమాల్లో మళ్లీ మెరవదేమో అనుకున్నప్పుడల్లా ఏదో మిరాకిల్ జరుగుతోంది. ఆమధ్య 96 మూవీతో, తర్వాత పొన్నియన్ సెల్వంతో.. ఇలా మరో రెండుసార్లు కొత్త ఇన్నింగ్స్ షురూ చేసింది.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 06:06 PM IST

Trisha Krishnan: సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పటికీ బ్యాచిలరే. ఆమెకు ఇంకా పెళ్లి కాకపోయినప్పటికీ మూడు పెళ్లిళ్ల కుమారి అంటున్నారు. అక్కడే విషయం అంతుచిక్కట్లేదు. 21 ఏళ్ల కెరీర్‌లో త్రిష కెరీర‌కి మూడుసార్లు ఎండ్ కార్డ్ పడింది. ఇక తను సినిమాల్లో మళ్లీ మెరవదేమో అనుకున్నప్పుడల్లా ఏదో మిరాకిల్ జరుగుతోంది. ఆమధ్య 96 మూవీతో, తర్వాత పొన్నియన్ సెల్వంతో.. ఇలా మరో రెండుసార్లు కొత్త ఇన్నింగ్స్ షురూ చేసింది. ఇప్పుడు మూడో ఇన్నింగ్స్‌లో బిజీ అయిన తనకు, మూడుముళ్లు మూడోసారి పడతాయంటున్నారు.

అక్కడే అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏంటంటే, త్రిష.. చీకటి రాజ్యం మూవీ చేసేప్పుడు, బెర్లిన్ పెళ్లి కొడుకుతో మ్యారేజ్ అన్నారు. జర్మనీలో పెళ్లైంది. ఇండియన్ స్టైల్లో పెళ్లే భాకీ అన్నారు. తీరా చూస్తే అది రూమర్ అని తేలింది. తర్వాత మరో వ్యాపారవేత్తతో త్రిష ప్రేమలోపడి ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లి వరకెళ్లింది. తార్వత చూస్తే ఆ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మలయాళ నిర్మాతలో డేటింగ్ అని, త్వరలో మూడు ముళ్ల తర్వాత కొత్త లైఫ్‌లోకి ట్రావెలింగ్ జరిగిపోతుందంటున్నారు. కాని సీన్ చూస్తే ఇది గుసగుసలే అనుకోవాల్సి వస్తోంది. కాని ఆ నిర్మాత నుంచి మాత్రం ప్రపోజల్ కాస్త గట్టిగానే వచ్చిందని తెలుస్తోంది.