బ్రో మూవీలో డైలాగ్స్ తో ఏపీ నాయకుల్ని టార్గెట్ చేశారు. పవన్ ని ఇంప్రెస్ చేయబోయి ఏదో చేసిన త్రివిక్రమ్, ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలతో పెట్టుకున్నాడు. దీని ప్రభావం గుంటూరు కారం సినిమా రిలీజ్ టైంలో పడేఅవకాశం ఉంది అని భావిస్తున్నారు.
మహేశ్ బాబు జగన్ కి ఎంత దగ్గరైనా, త్రివిక్రమ్ కి ఏపీ పొలిటీషియన్స్ వదిలేస్తారనుకోలేం. వకీల్ సాబ్ లో పంచ్ డైలాగ్స్ కి, బ్రో లో అంబాటి మీద పరోక్ష పంచ్ లకి త్రివిక్రమే కర్త, కర్మ, క్రియ అంటున్నారు. సో ఈ ఎఫెక్ట్ తో గుంటూరు కారం రిలజ్ అయ్యే టైంలో ఎక్స్ ట్రా షోలు, అదనపు సపోర్ట్ లాంటివి ఉండకపోవచ్చని, పైపెచ్చు ఎదురుదాడే జరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా మహేశ్ వెళ్లి మాట్లాడితే గుంటూరు కారం రిలీజ్ టైంలో సమస్య తీరొచ్చు. కాని ఎవరికోసం ఇదంతా.. త్రివిక్రమ్ పెట్టిన పెంటకి, మహేశ్ సఫర్ అవ్వాల్సి వస్తోందా అనే చర్చ కూడా లోలోపల జరుగుతుంది.