యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం గతంలో త్రివిక్రమ్ ఓ కథ రాశాడు. సాహో షూటింగ్ టైంలో నెరేషన్ కూడా ఇచ్చాడు. కాని ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. సాహో తో కమిటవ్వటం, రాధేశ్యామ్, ఆదిపురుష్ కోసం అప్పట్లోనే ప్రభాస్ ఆ దర్శకులకి మాటివ్వటంతో, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
ఇప్పుడు అదే కథని అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఆ కథ కి చాలా మార్పులు చేసి, ఓ ఫ్యామిలీ డ్రామాని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నాడట. ఇంతవరకు పాన్ ఇండియా సినిమా లంటే బాహుబలి, ఆదిపురుష్, కేజీయఫ్, త్రిబుల్ ఆర్, కాంటారా లాంటి సినిమాలే వచ్చాయి. ఇలా ఎన్ని జోనర్లు వచ్చినా ఫ్యామిలీ డ్రామా జోనర్ లో పాన్ ఇండియా మూవీ రాలేదు.
అందుకే ఫస్ట్ టైం ఓ ఫ్యామిలీ డ్రామాని త్రివిక్రమ్ పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ మరో పాజిటివ్ అంశం ఏంటంటే, ఒక హీర రిజెక్ట్ చేసిన కథ మరో హీరో చేసి హిట్ మెట్టెక్కిన సందర్భాలే ఎక్కువ. పవన్ వదిలేసిన అతడు మహేశ్ చేశాడు, మహేశ్ వదిలేసిన పుష్ బన్నీ చేసి హిట్ట మెట్టెక్కాడు. బన్నీ వదిలేసిన చెర్రీ చేసి ధృవగా దూసుకెళ్లాడు.. సో ఇది కూడా అలా చూస్తే వర్కవుట్ అయ్యే అవకాశమే ఎక్కువ. అందులోనూ ఫస్ట్ పాన్ ఇండియా ఫ్యామిలీ డ్రామా కాబట్టి, దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో అటెన్షన్ పెరుగుతుంది.