Kalki : బడ్జెట్‌ రూ.700 కోట్లు, బిజినెస్‌ రూ.1000 కోట్లు

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాల నిర్మాణం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తోనే మొదలైందన్న విషయం తెలిసిందే. బాహుబలి నుంచి సలార్‌ వరకు ప్రభాస్‌తో చేసిన ప్రతి సినిమా టాలీవుడ్‌ లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో నిర్మించిందే.

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాల నిర్మాణం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తోనే మొదలైందన్న విషయం తెలిసిందే. బాహుబలి నుంచి సలార్‌ వరకు ప్రభాస్‌తో చేసిన ప్రతి సినిమా టాలీవుడ్‌ లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో నిర్మించిందే. ప్రభాస్‌ తాజా సినిమా ‘కల్కి 2898ఎడి’ అన్నింటి కంటే ఎక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. జూన్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్స్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రారంభించినపుడే ఇది ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా అని వైజయంతీ మూవీస్‌ సంస్థ ప్రకటించింది.

ఈ సినిమా కోసం మొదట అనుకున్న బడ్జెట్‌ రూ.500 కోట్లు. నిర్మాణ దశలో ఉన్నప్పుడే అది రూ.600 కోట్లకు పెరిగింది. సినిమా రిలీజ్‌ అయ్యే టైమ్‌కి ఆ బడ్జెట్‌ కాస్తా రూ.700 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి విడుదలైన కంటెంట్‌లో ఆ భారీతనం కనిపిస్తోంది. హాలీవుడ్‌ స్థాయి ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో నిర్మించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఇంత భారీగా నిర్మించిన ఈ సినిమాకి ప్రొడక్షన్‌ కాస్ట్‌ రూ.450 కోట్లు, రూ.250 కోట్లు రెమ్యునరేషన్లుగా చెల్లించారని తెలుస్తోంది. ఇందులో రూ.150 కోట్లు ప్రభాస్‌ పారితోషికంగా చెల్లించారని సమాచారం. ఇక ‘కల్కి’లో కీలక పాత్రలు పోషించిన అమితాబ్‌, కమల్‌హాసన్‌లకు రూ.20 కోట్ల చొప్పున రెమ్యునరేషన్‌ ఇచ్చారట.

ఇంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి బిజినెస్‌ కూడా ఆ రేంజ్‌లోనే జరిగిందని తెలుస్తోంది. థియేట్రికల్‌ రైట్స్‌ రూపంలో రూ.600 కోట్లు వచ్చాయట. ఇక డిజిటల్‌ రైట్స్‌ని కూడా భారీ మొత్తంలోనే అమ్మారని తెలుస్తోంది. టోటల్‌గా రూ.1000 కోట్లకుపైనే బిజినెస్‌ జరిగిందని సమాచారం. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాను రిలీజ్‌ చేయనన్ని థియేటర్లలో ‘కల్కి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారట. హయ్యస్ట్‌ బడ్జెట్‌తో నిర్మించిన ఇండియన్‌ మూవీగానే కాదు, హయ్యస్ట్‌ థియేటర్లలో రిలీజ్‌ అవుతున్న భారతీయ సినిమాగా ‘కల్కి’ రికార్డు క్రియేట్‌ చెయ్యబోతోంది