Indraja : ఇంద్రజ ఔట్.. సదా ఇన్..

జబర్ధస్త్‌ షో (Jabardasth Show) తెలుగునాట ఎంత పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నటులుగా, దర్శకులుగా, టెక్నీషియన్‌లుగా ఇలా పలు విభాగాల్లో జబర్దస్త్‌ నటులు మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఈ షో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శితమవుతుంది.

 

 

జబర్ధస్త్‌ షో (Jabardasth Show) తెలుగునాట ఎంత పాపులారిటీ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నటులుగా, దర్శకులుగా, టెక్నీషియన్‌లుగా ఇలా పలు విభాగాల్లో జబర్దస్త్‌ నటులు మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఈ షో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శితమవుతుంది. అత్యధిక టిఆర్పి రేట్లతో దూసుకెళుతున్నా జబర్దస్త్ ఇటీవల కొంచెం డల్ అయినట్లు కనిపిస్తోంది. అందుకు చాలానే కారణాలున్నాయి. చాలా మంది కమెడియన్లు సినిమా ఆఫర్లతో బిజీగా ఉండి ఈ షోను వదిలి వెళ్లిపోవడం, యాంకర్లు మారడం ఇలా చాలా మార్పులు జరిగాయి. దాంతో ఈ మధ్య జబర్దస్త్ కాస్త డల్ అయినట్లు కనిపిస్తుంది.

ఇక ఈ షోకు చాలామంది సెలబ్రిటీలు జడ్జిలుగా వ్యవహరించారు. అయితే రోజా, నాగబాబు ల స్థానాన్ని చాలా కాలం ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు జడ్జీగా వ్యవహరిస్తున్న ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ మాత్రం మంచి పాపులారిటీ తెచ్చుకుంది. రోజా, నాగబాబు టైమ్ లో ఎలా ఉండేదో.. ఇప్పుడు ఇంద్రజ కూడా ఆ రేంజ్ లో జబర్దస్త్ షో ను ముందుకు తీసుకెళ్లింది. ఇక జబర్దస్త్ ద్వారా ఇంద్రజ కూడా బుల్లితెరపై తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఒకప్పటి హీరోయిన్ లా కాకుండా ఇప్పటి జడ్జీగా బుల్లితెర ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇంద్రజ.. జబర్దస్త్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో అక్కడున్న కమెడియన్లు అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. నిజానికి ఇంద్రజ జబర్దస్త్ తో చాలా మందికి దగ్గరైంది. అంతేకాకుండా చాలా మంది కమెడియన్లు తనను అమ్మ అని పిలుస్తుంటారు. అలాంటి బంధం ఏర్పరుచుకోవడం వల్లే తను కొంత కాలం గ్యాప్ తీసుకోవడంతో అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇంద్రజ రోల్ ఎవరు రిప్లేస్ చేస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఎక్స్‌ట్రా జబర్దస్త్ కు ప్రస్తుతం జడ్జిగా చేస్తున్న సదానే.. జబర్దస్త్ కు కూడా జడ్జిగా చేస్తున్నట్లు ఇన్ సైడ్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరో వారం రోజుల పాటు వేచి చూడాల్సిందే.

ఇంద్రజ జబర్దస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్ కు సుమారుగా లక్ష రూపాయల వరకు ఇంద్రజ పారితోషికం అందుకుంటుందని ఇన్ సైడ్ టాక్. నెలకు నాలుగు జబర్దస్త్ ఎపిసోడ్‌లు టెలికాస్ట్ అవుతాయి. ఈ లెక్కన ఇంద్రజ నాలుగు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు. ఇక అప్పుడప్పుడు ఖుష్బూ స్థానంలో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కూడా జడ్జిగా వెళ్తంది. దానికి అదనంగా మరో లక్ష. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీకు కూడా రోజు చెప్పున బాగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఇన్ సైడ్ టాక్. ఈ లెక్కన నెలకు ఆరేడు లక్షలు బుల్లితెరపైనే ఇంద్రజ ఈజీగా సంపాదించుకుంటుంది.