Rajinikanth: రజనీకాంత్ పేరు.. కొన్నిరోజులుగా ఏదోలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు వచ్చినప్పుడు.. తలైవా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్‌గా రియాక్ట్ కావడంతో.. అప్పట్లో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే ఆ తర్వాత మొరగని కుక్క ఉండదు.. అర్థమైందా రాజా అంటూ జైలర్ ఆడియో ఫంక్షన్‌లో రజనీ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చ రేపాయి. ఆ తర్వాత జైలర్ రిలీజ్ అయింది.
వింటేజ్ రజనీకాంత్ అంటూ మళ్లీ చర్చ జరిగింది. ఇలా ఆయన చర్చలో ఉండడానికి జైలర్ మూవీ సక్సెస్ ఓ కారణం అయితే.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేయడం మరో కారణం. తన ఆధ్యాత్మిక యాత్రను ముగించుకున్న రజనీకాంత్ యూపీ వెల్లి, అక్కడ యోగితో కలిసి జైలర్ మూవీ చూశాడు. ఆ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేశారు. అంత పెద్ద సూపర్ స్టార్… ముఖ్యమంత్రి కాళ్లు తాకడమేంటని కొందరు విమర్శించారు. ఈ విషయంపై రజనీ అభిమానులకు, ట్రోలర్స్‌కు మధ్య రెండు రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ యుద్ధమే జరుగుతోంది. దీనిపై రజనీకాంత్ రియాక్ట్ అయ్యాడు.
స్వామిజీలు, యోగులు కనిపించినప్పుడు.. తాను వెంటనే వాళ్ల కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకుంటానని.. వాళ్లు తనకంటే కంటే వయసులో పెద్ద వారా లేదా అని చూడనని.. అది తన పద్దతి అంటూ క్లారిటీ ఇచ్చాడు తలైవా. దీంతో వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లు అయింది. ఇదంతా ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర జైలర్ ఊచకోత కంటిన్యూ అవుతోంది. భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. చాలారోజుల తర్వాత రజనీ తన స్టైల్‌తో, డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. విడుదలైన 10 రోజుల్లోనే రూ.5వందల కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.