510 కోట్ల దేవరనే దాటేశాడా…? 2వ రోజెందుకు ఢమాల్..?

పాన్ ఇండియా మూవీ ఏదైనా హిట్టైతే సరిపోదు.. రికార్డులు క్రియేట్ చేయాలి.. పక్క సినిమాల రికార్డులు బద్దలు కొట్టాలి. తర్వాత పక్క సినిమాలతో పోల్చి ఇది అంతకంటే హిట్ అని ప్రచారం చేయాలి.. ఇది ప్రజెంట్ పాన్ ఇండియా మూవీల మార్కెటింగ్ స్టైల్..

  • Written By:
  • Publish Date - December 9, 2024 / 03:59 PM IST

పాన్ ఇండియా మూవీ ఏదైనా హిట్టైతే సరిపోదు.. రికార్డులు క్రియేట్ చేయాలి.. పక్క సినిమాల రికార్డులు బద్దలు కొట్టాలి. తర్వాత పక్క సినిమాలతో పోల్చి ఇది అంతకంటే హిట్ అని ప్రచారం చేయాలి.. ఇది ప్రజెంట్ పాన్ ఇండియా మూవీల మార్కెటింగ్ స్టైల్.. ఆప్రాసెస్ లోనే పుష్ప2 టీం దారి తప్పిందా? స్వరం పెంచిందా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర యూఎస్ లో లైఫ్ టైంలో రాబట్టిన వసూళ్లని పుష్ప2 రెండు రోజుల్లో రాబట్టిందంటున్నారు. వరల్డ్ వైడ్ గా దేవర లైఫ్ టైం వసూళ్లనీ 3 రోజుల్లో మూసేసినట్టే అని మరొకరు ప్రచారం చేస్తారు.. కాకపోతే నిర్మాతల ఎనౌన్స్ మెంట్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ని కెలికేసిందంటున్నారు.. మెన్నటి దాకా మెగా ఫ్యాన్స్ తో వార్ కాస్త ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో వార్ గా మారిందా? సోషల్ మీడియాలో అల్లు ఆర్మీకి ఎదురైన ఇబ్బందులేంటి?

దేవర మీద ఎంత యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ చేసినా ప్రపంచ వ్యాప్తంగా 510 నుంచి 570 కోట్ల వరకు రాబట్టింది ఎన్టీఆర్ మూవీ. ఇక యూఎస్ లో అయితే 8 మిలియన్లు, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ వసూళ్లతో కలిపి 10 మిలియన్ల వరకు వసూళ్లొచ్చాయి.విచిత్రం ఏంటంటే, ఈరెండు రికార్డులని కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ చేసింది పుష్ప 2 మూవీ అంటున్నారు. ఇక్కడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎటాక్ షురూ చేసింది

ఎందుకంటే యూఎస్ లో మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే కల్కీ 5.56 మిలియన్లు, త్రిబుల్ ఆర్ 5.50 మిలియన్లు, బాహుబలి 2 మూవీ 4.59 మిలియన్లురాబట్టింది.
పుష్ప 2 మాత్రం 4.47 మిలియన్ల ఓపెనింగ్స్ తో టాప్ 4 ప్లేస్ లో ఉందట.

అంటే 3.7 మిలియన్ల దేవర వసూళ్లని పుష్ప 2 మించినట్టేనా? అక్కడే ట్విస్ట్ ఉంది. యూఎస్ లో పుష్ఫ 2 మీద భారీ అంచానల గోల ఉన్నా, అడ్వాన్స్ బుక్కింగ్స్ అంతగా జరగలేదు. దేవరకి జరిగినంతగా అడ్వాన్స్ బుక్కింగ్ అక్కడ పుష్పకి మిస్ అయ్యింది. నార్త్ ఇండియాలో మాత్రం పుష్ప2 కి భారీ ఎత్తున పాజిటివ్ టాక్, భారీ ఎత్తున వసూళ్లొస్తున్నాయి. సో అంతవరకు ఓకే కాని, యూఎస్ లో, తెలుగు రాష్ట్రాల్లో పుష్ప2 వసూళ్లే డౌట్ ఫుల్ గా ఉంటున్నాయంటున్నారు

ఇంకా ట్విస్ట్ ఏంటంటే పుష్ప2 రెండో రోజు వసూళ్ళతో కలుపుకుని 400 కోట్లొచ్చాయని, శనివారం, ఆదివారం వసూల్లతో దేవర లైఫ్ టైంలో రాబట్టి 510 నుంచి 570 కోట్ల వసూళ్లని పుష్ప 2 బీట్ చేస్తుందంటున్నారు. అంటే దేవర థియేటర్స్ లో 50 రోజుల్లో రాబట్టిన వసూళ్లని పుష్ప 2 కేవలం 4 రోజుల్లో రాబట్టినట్టౌతోంది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు డ్రాప్ అయ్యాయి. కేరళాలో ఫాహద్ ఫాజిల్ రోల్ నచ్చక పుష్ప2 మీద జనం ఫైర్ అవుతున్నారు. కన్నడ, తమిళ మార్కెట్లో పుష్ప2 కి పెద్దగా రెస్పాన్స్ లేదు. ఎటొచ్చి నార్త్ ఇండియా వసూల్లనే లెక్కలోకి తీసుకున్న దేవర లైఫ్ టైం వసూళ్లని నాలుగు రోజుల్లో పుష్ప రాజ్ బీట్ చేయటం సాధ్యం కాదు.. ఎంత టిక్కెట్ రేట్లు పెంచినా ఇది సాధ్యం కాదు

ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ వరకు ఓకే కాని, కామన్ ఆడియన్స్ ఇంకా పుష్ప2 వైపు అడుగులేయలేదు. టిక్కెట్ల రేట్లకు భయపటి ఫ్యామిలీ ఆడియన్స్, మిడిల్ క్లాస్ బ్యాచ్ ఇటు వైపు చూడట్లేదు. ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకుని నాలుగు రోజుల్లో 600 కోట్ల వసూళ్లనటం రాంగ్ ప్రమోషన్ కిందకొస్తుందంటున్నారు.