Darling, Prabhas : డైనోసార్‌.. డార్లింగ్‌గా మారే సమయం ఆసన్నమైంది..!

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ అందరూ ఊహించినట్టుగానే ‘సలార్‌’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చాలా కాలం తర్వాత ఘనవిజయాన్ని అందుకున్న ప్రభాస్‌ అదే ఊపులో తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్స్‌ను కూడా అందిస్తున్నాడు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘కల్కి 2898 ఎడి’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా ఇస్తూ తన ఫ్యాన్స్‌కి సంతోషాన్ని అందిస్తున్నాడు.

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ అందరూ ఊహించినట్టుగానే ‘సలార్‌’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చాలా కాలం తర్వాత ఘనవిజయాన్ని అందుకున్న ప్రభాస్‌ అదే ఊపులో తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్స్‌ను కూడా అందిస్తున్నాడు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘కల్కి 2898 ఎడి’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా ఇస్తూ తన ఫ్యాన్స్‌కి సంతోషాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు మారుతి డైరెక్షన్‌లో కూడా ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ తాజాగా సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు నిర్మాత ఎస్‌కెఎన్‌.

ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కొత్త అవతార్‌ను సంక్రాంతికి రివీల్‌ చెయ్యబోతున్నామంటూ ప్రకటించారు. డైనోసార్‌.. పక్కా డార్లింగ్‌గా టాన్స్‌ఫార్మేషన్‌ అయిన లుక్‌ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ లాంచ్‌ చేయబోతోంది. ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ సంక్రాంతికి లాంఛ్‌ చేస్తున్నామంటూ ట్వీట్‌ చేశారు.

డార్లింగ్‌ తర్వాత ప్రభాస్‌ లవర్‌బోయ్‌ లుక్‌లో కనిపించలేదు. మళ్ళీ అలాంటి లుక్‌ని తన సినిమాలో చూస్తారని చెబుతున్నాడు మారుతి. ఈ సినిమాకి రాజా డీలక్స్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌ రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రిద్దీ కుమార్‌ కీ రోల్‌లో నటిస్తోంది. నుదుటన బొట్టు, లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో మ్యాన్లీ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ రిద్దికుమార్‌తో క్లోజప్‌ యాంగిల్‌లో ఉన్న స్టిల్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.