ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖ నటుడు జగపతి బాబు యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలతో సంబంధం లేకుండా తాను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా డైలీ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ అప్డేట్ చేస్తూ వస్తున్నారు జగపతి బాబు. ఇక తన దినచర్య గురించి ఆరోగ్యానికి తాను తీసుకునే జాగ్రత్తల గురించి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఉంటారు. అలాగే తాను ఖాళీగా ఉన్న సమయంలో కబుర్లు చెప్పాలి అంటూ కూడా ఫ్యాన్స్ ని అడుగుతూ ఉంటాడు జగ్గు భాయ్.
తాజాగా ఆయన ఒక వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో జగపతి బాబు బెండకాయ్ జ్యూస్ తాగడం గురించి చూపించారు. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా బెండకాయ్ జ్యూస్ అనేది తాగడం ఎప్పుడూ విని ఉండం. కాని జగపతి బాబు తాగడం చూసి ఎందుకు అని అడిగారు అందరూ. వారిలో మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. వై బెండకాయ్ జ్యూస్ అంటూ ఆమె కామెంట్ చేసారు. ఆ కామెంట్ కి చాలా మంది చాలా రకాలుగా రిప్లైలు ఇచ్చారు. ఆ కామెంట్ చూసిన జగపతి బాబు కూడా రిప్లై ఇచ్చారు.
మంచు లక్ష్మీని ట్యాగ్ చేస్తూ… లచ్చిమీ… బెండకాయ్ రసం కొలెస్ట్రాల్ కి చాలా మంచిది… నాకు నీకు కొవ్వు ఎక్కువ కాబట్టి మనకి చాలా అవసరం అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇక మీమ్స్ పేజెస్ అయితే ఆ కామెంట్ ని చూసి పండుగ చేసుకుంటున్నాయి. ఈయన్ని అనవసరంగా కేలికా అంటూ మంచు లక్ష్మీ ఫోటో పెట్టి వైరల్ చేస్తున్నారు. కాగా జగపతి బాబు ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. విలన్ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జగపతి బాబు.