Jagapathi Babu: సిగ్గులేకుండా అడుగుతున్నా.. బర్త్‌డే రోజు జగ్గూభాయ్‌ వైరల్‌ పోస్ట్‌..

ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న జగ్గూభాయ్‌.. తర్వాత విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా తనను తాను మల్చుకుని మరింత సెన్సేషన్‌గా మారాడు. పాత్ర ఏదైనా సరే.. తనదైన స్టైల్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తాడు. అందుకే దర్శక నిర్మాతల ఫేవరెట్‌ అయిపోయాడు. ఫిబ్రవరి 12.. జగపతిబాబు బర్త్‌డే.

  • Written By:
  • Updated On - February 12, 2024 / 05:54 PM IST

Jagapathi Babu: టాలీవుడ్‌లో పరిచయం అవసరం లేని పేరు జగపతిబాబు. ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న జగ్గూభాయ్‌.. తర్వాత విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా తనను తాను మల్చుకుని మరింత సెన్సేషన్‌గా మారాడు. పాత్ర ఏదైనా సరే.. తనదైన స్టైల్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తాడు. అందుకే దర్శక నిర్మాతల ఫేవరెట్‌ అయిపోయాడు. ఫిబ్రవరి 12.. జగపతిబాబు బర్త్‌డే. పుట్టిన రోజుగా సందర్భంగా ట్విటర్‌లో వెరైటీ పోస్ట్‌పెట్టాడు జగ్గూభాయ్‌.

Amit Shah: టీడీపీకి షాక్‌.. 70సీట్లు ఇస్తేనే పొత్తు.. చంద్రబాబుకు బీజేపీ షాక్‌..

ఎలాగోలా పుట్టేశాను.. సిగ్గు లేకుండా అడుగుతున్నా.. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. ఇక రెండోది.. తొందరగా డిసైడ్ చేయండి.. ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌లో ఒక‌వైపు మిల్క్‌ బాటిల్.. మరోవైపు మద్యం బాటిల్‌తో ఉన్న ఫొటో షేర్‌ చేశాడు. ఈ పోస్ట్ కింద.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు. లెఫ్ట్‌ హ్యాండ్‌లో ఉన్న బాటిల్‌ మాకిచ్చెయ్.. రైట్‌ హ్యాండ్‌లో ఉన్న మిల్క్‌ తాగి పడుకో అంటూ కొందరు కామెంట్లు చేస్తే.. ఇద్దరం కలిసి మందు కొడదాం సార్ అంటూ మరికొందరు.. ఖాన్సార్ నిబంధనలు ఏంటి సార్ అంటూ సలార్ మూవీ గురించి ప్రస్తావిస్తూ ఇంకొందరు.. ఇలా ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. అవన్నీ పొట్టచెక్కలయ్యేలా ఉన్నాయ్. జగ్గూభాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక అటు కెరీర్‌పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు జగ్గూభాయ్‌. సలార్‌ 2తో పాటు పుష్ప ది రూల్‌లోనూ కనిపించబోతున్నాడు.

టాప్ హీరోల సినిమాల్లో జగపతిబాబు కనిపించడం కామన్‌గా మారిపోయింది. ఎలాంటి పాత్రకు అయినా న్యాయం చేసే నటుడు కావడంతో.. జగ్గూభాయ్‌ తమ సినిమాల్లో ఉండేలా డైరెక్టర్లు పాత్రలు క్రియేట్‌ చేస్తున్నారు. జూనియర్‌ శోభన్‌బాబు అనే లెవల్‌లో హీరోగా పేరు తెచ్చుకున్న జగ్గూభాయ్‌.. ప్రస్తుతం 63వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఐనా సరే స్టైలిష్‌ లుక్‌తో హీరోకి ఏ మాత్రం తక్కువ కాదు అనిపించే ఫిజిక్ మెయింటేన్‌ చేస్తున్నాడు.