JAI HANUMAN: త్రిబుల్ ఆర్‌లో రామ్ చరణ్ రాముడి గెటప్‌లో షాక్ ఇచ్చాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఆ ఫైట్‌లో రాముడి అవతారంలో విల్లు పట్టిన తను మతిపోగొట్టాడు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ అయితే ఏకంగా రాముడిగా మారి ఆదిపురుష్ సినిమా చేశాడు. అలా వెండితెర రాముడిగా ఈ ఇద్దరు హీరోలు కనిపించారు. కాని వెండి తెర హనుమంతుడి పాత్రకి మాత్రం నో చెబుతున్నారు. హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రూ.300 కోట్లు రాబట్టింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ రూపంలో జై హనుమాన్‌ని ప్లాన్ చేసింది సినిమా టీం. కథ, కథనం పూర్తయ్యాయి.
SS RAJAMOULI: పుకార్లకు ఫుల్‌స్టాప్.. రాజమౌళి ప్రెస్ మీట్.. SSMB 29 కోసమేనా..!
ఇక రెండో భాగంలో హనుమంతుడి ఎంట్రీ ఉంటుందని మొదటి భాగంలోనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ హింట్ ప్రకారం జై హనుమాన్ సినిమా తీయాలంటే లార్డ్ హనుమాన్ పాత్రలో పెద్ద హీరో ఎవరైనా నటించక తప్పదు. ముందుగా కేజీయఫ్ ఫేం యష్‌ని ట్రై చేస్తే తను టాక్సిక్ మూవీ పనుల్లో బిజీ అయ్యాడు. సరే చరణ్, ప్రభాస్‌ని ట్రై చేందామని ప్రశాంత్ వర్మ ప్రయత్నిస్తే, వాళ్లు ఆల్రెడీ కమిటైన ప్రాజెక్టుల వల్ల కాల్‌షీట్స్ ఇచ్చే పరిస్తితి లేదు. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ పూర్తయ్యే వరకు తన లుక్ మార్చకూడదు కాబట్టి, గెటప్ కోసం హానుమాన్ పాత్రకి నో చెప్పాల్సి వచ్చిందట.
ఆఖరికి మహేశ్ బాబుని కూడా జై హనుమాన్ రోల్‌లో గెస్ట్‌గా కనిపించేలా ప్రశాంత్ వర్మ ప్రయత్నిస్తే, రాజమౌళి మూవీ పూర్తయ్యే వరకు తన లుక్కే రివీల్ కావొద్దని కండీషన్ ఉంది. సో అక్కడా నో ఛాన్స్. ఏదైనా ఛాన్స్ ఉంటే మెగాస్టార్ చిరంజీవినే అనుకుంటున్నారు. కాని విశ్వంభర మూవీ పూర్తయ్యే దాన్ని బట్టి చిరు లార్డ్ హనుమాన్‌గా కనిపిస్తాడా లేదా అని ఇంకా తేలలేదు. అందరికీ ఆ పాత్ర వేయాలనే మనసున్నా, మార్గమే కనిపించట్లేదు.