ఆ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. 5 వందల కోట్లు పెట్టి తీసిన సినిమా ఇలాగే ఉంటుందా అంటూ మాట్లాడుకున్నారు నెటిజన్లు. ఇక ఫ్యాన్స్ ఐతే ఏకంగా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయండి అంటూ చెప్పేశారు. దీంతో అవుట్‌పుట్‌లో కొన్ని మార్పులు చేసింది మూవీ టీం. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ లుక్ విషయంలో చాలా మార్పులు చేసి తరువాత ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ తరువాత జై శ్రీరామ్ సాంగ్ గ్లింప్స్‌ను లాంచ్ చేసింది. ఈ పాటకు ఆడియన్స్‌ను నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ రాముడిగా నేచురల్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఇప్పుడు జై శ్రీరాం ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా జైశ్రీరాం మ్యూజిక్‌తో ప్రభాస్ నడుస్తూ వస్తున్న సీన్ మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.
ప్రభాస్‌ను రాముడి గెటప్‌లో చూసిన తరువాత వేరే వాళ్లను ఆ క్యారెక్టర్‌లో ఊహించుకోలేపోతున్నామంటున్నారు ఫ్యాన్స్. భార్య దూరమైన రాముడు ఎలా ఉంటాడో ప్రభాస్ ఇప్పుడు అలాగే కనిపిస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ఓవరాల్‌గా సినిమా మీద వచ్చిన మొత్తం నెగటివిటీని జైశ్రీరాం సాంగ్ జస్ట్ 2 నిమిషాల్లో తుడిచేసింది. ఇందుకే ప్రతీ సినిమాకు మ్యూజిక్ ప్రాణం. కలెక్షన్ల పరంగా కూడా ఆదిపురుష్ కాసుల వర్షం కురిపిస్తుందంటున్నారు అనలిస్ట్‌లు.
ఈ సినిమా మీద సౌత్‌లో కంటే నార్త్‌లో డబుల్ హోప్స్ ఉన్నాయి. దీంతో వెయ్యి కోట్ల టార్గెట్ ఈజీగా రీజ్ అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం సాంగ్‌లో ఉన్న విజువల్స్, క్యారెక్టర్స్ లుక్‌ని బట్టి చూస్తే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఆదిపురుష్ కొత్త హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు అనిపిస్తోంది.