Lokesh kankaraju : కూలీపై జైలర్ రిఫరెన్స్‌లు..!

జైలర్ (Jailer) సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్.. చాలా రోజుల తరువాత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజని.. తన అసలు సిసలైన మాస్ పవరేంటో చూపించాడు.. ఈ సినిమా అందించిన ఊపుతోనే ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలను లైన్లో పెడుతున్నాడు.

జైలర్ (Jailer) సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్.. చాలా రోజుల తరువాత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజని.. తన అసలు సిసలైన మాస్ పవరేంటో చూపించాడు.. ఈ సినిమా అందించిన ఊపుతోనే ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రజెంట్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanaka Raj) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే.. రజనీ నుంచి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. లోకేశ్ గత సినిమాలతో పోలిస్తే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తరహాలో రజనీ కూలీ (Cooley) మూవీ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే.. లోకేష్ సినిమా అన్నది పక్కన పెడితే.. కూలీ సినిమా మీద జైలర్ మూవీ హిట్‌ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్న విషయంపైనే ఫ్యాన్స్‌ ఇప్పుడు కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు.

కూలీ టీజర్ లో బంగారు వాచీలతో కూడిన కొంతమంది గ్యాంగ్ స్టార్స్ ను చితక్కొట్టిన కూలీగా రజినీ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రజినీ లుక్, స్వాగ్ అదిరిపోయింది. మూడు నిముషాలు పాటు ఉన్న ఈ టీజర్ ని యాక్షన్ కట్ తో రెడీ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి.. సినిమా పై భారీ అంచనాలనే క్రియేట్ చేసారు మేకర్స్‌.. ఒక్క మాటలో చెప్పాలంటే కూలీ టీజర్ రజనీ స్టైల్‌ను ఇంపాక్ట్ చేస్తూ లోకేష్ కనగరాజ్ స్టైల్ లో నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇక.. జైలర్ తో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చిన సూపర్ స్టార్ కూలీలో డబుల్ ఎనర్జీతో కనిపించాడు. అయితే.. కూలీ సినిమా టీజర్ లో జైలర్ రిఫరెన్స్ లు కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. జైలర్ తో రజినీ మేనరిజం స్టైల్ మొత్తం వాడేశాడు నెల్సన్.. సో.. కూలీ కోసం లోకేష్ రజనీ నుంచి ఇంకేదైనా కొత్తగా ట్రై చేసి ఉండాల్సిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

లోకేశ్ వదిలిన టీజర్‌ను బట్టి కూలీ సినిమా గోల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో భారీ యాక్షన్ సినిమాగా వస్తుందని అర్థమవుతుంది. అంతేకాదు రజినీ ఒకప్పటి డైలాగ్ ని మళ్లీ ఇందులో పెట్టాడు లోకేశ్.. దీంతో.. కూలీ సినిమా మరో జైలర్ కాబోంతోదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం కూలీ కాదు ఇది జైలర్ 2 అని ప్రమాదం ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సో.. లోకేష్ రజినీని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేయాల్సి ఉంటుందని.. దీనికోసం లోకేష్‌ కొత్తగా ప్రయత్నం చేయాలని అంటున్నారు. మరి.. కూలీపై జైలర్ రిఫరెన్స్ పడకుండా రజనీకి లోకేశ్‌ ఎలాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇస్తాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి..