బాహుబలి సినిమాతో తన ఫ్యూచర్ విజన్ ఏ రేంజ్ లో ఉందో క్లారిటీ ఇచ్చేసాడు జక్కన్న. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కొట్టి తనకు తిరుగులేదని గ్రాండ్ గా ప్రూవ్ చేసాడు. ఇప్పుడు జక్కన్న సినిమా అంటే ఓ పిచ్చి జనాలకు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అంచనా కూడా వేయలేకపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ స్టార్ హీరోలను పాన్ ఇండియా రేంజ్ లో పరిచయం చేస్తూ తనతో పాటు వాళ్లకు కూడా తిరుగులేదు అని ప్రూవ్ చేస్తూ విజువల్ వండర్స్ ను తెలుగు ప్రేక్షకులకే కాదు సినిమా పిచ్చోళ్ళకు చూపిస్తున్నాడు.
రాజమౌళి సినిమాలను చూసి టాలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్ లు కూడా తమ సినిమాలకు పదును పెడుతున్నారు. ఒక్కో సినిమా ఏ రేంజ్ లో ఉండాలో యువ డైరెక్టర్ లు జక్కన్నను చూసి నేర్చుకుంటున్నారు. అలాంటి జక్కన్న ఇప్పుడు క్లాస్ లకు అటెండ్ అవుతున్నాడే వార్త టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ అవుతోంది. వర్కింగ్ టైటిల్ ఎస్‌ఎస్ఎంబీ29గా సినిమా షూట్ ను జనవరి మిడ్ నుంచి మొదలుపెడుతున్నారు. దీనికి ఇప్పటికే మేకర్స్ ఓ భారీ సెట్ ను కూడా రెడీ చేసేసారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బేనర్‌పై డాక్టర్ కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను… జక్కన్న హాలీవుడ్ ను టార్గెట్ చేసి ప్లాన్ చేస్తున్నాడు. ఇక సినిమాలో కొన్ని సీన్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ కూడా తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇందుకోసం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏఐని తన సినిమా కోసం ఏ రేంజ్ లో వాడుకోవాలో తెలుసుకోవడానికి… అందుకు సంబంధించిన ట్రిక్స్ కోసం స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాను జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
కొత్త టెక్నాలజీతో మైండ్ బ్లాక్ అయ్యే గ్రాఫిక్స్ తో వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించడానికి జక్కన్న స్కెచ్ గట్టిగానే గీసాడు. దీనితో సినిమాపై అంచనాలు అప్పుడే పెరుగుతున్నాయి. ఇక తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ సహా 9 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు టాక్. స్పానిష్, చైనీస్ భాషల్లో అలాగే కొరియన్, జపనీస్ భాషల్లో కూడా సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అమెజాన్ అడవుల్లో ఓ తెగను ప్రధానంగా చేసుకుని మహేష్ తో షూట్ చేస్తాడట. ఇందుకోసం త్వరలోనే బ్రెజిల్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2026 జూన్ లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.