స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ మారడంలో ఆయన భార్య స్నేహా రెడ్డి పాత్ర కచ్చితంగా ఉంది. బన్నీ సినిమాల విషయంలో పక్కా లెక్కలతో ఆమె సపోర్ట్ చేస్తున్నారు. ఇక సినిమాలను ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తే ప్లస్ అవుతుందో కూడా ఆమె ఇప్పటికే ప్రూవ్ చేసారు. ఇక బన్నీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో స్నేహా రెడ్డి ఇప్పుడు బన్నీ సినిమాల కోసం కొత్తగా ఆలోచిస్తూ వసూళ్లు పెంచే పనిలో పడ్డారు. ఇప్పుడు ఆమె చేతిలో పుష్ప 2 సినిమా ఉంది. ఈ సినిమా గనుక వరల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టిస్తే ఆ క్రెడిట్ లో ఆమెకు కూడా భాగం ఉంటుంది.
సుకుమార్ ఇప్పటికే పుష్ప 2 విషయంలో ఏం చేయగలడో అది చేసి చూపిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్స్ ను కూడా రంగంలోకి దింపి షూట్ చేస్తున్నాడు. ఇక త్వరలోనే ఐటెం సాంగ్ విషయంలో కూడా ఓ ప్లాన్ వేసుకుని అడుగులు వేస్తున్నాడు సుక్కు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పుష్ప 2 లో ఇద్దరు క్రికెటర్లు నటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగు సినిమాలు అంటే పిచ్చి. అతనికి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అతనితో చర్చిస్తున్నారు.
ఇప్పటికే అతని పార్ట్ కూడా షూట్ చేసారని 8 నిమిషాలు ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇక మరో క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా ఇప్పుడు పుష్ప 2 లో నటించే అవకాశం ఉంది. గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్తగా అతను… సరుకుని సముద్రంలో బోర్డర్ దాటిస్తూ ఉంటాడు. ఆ పాత్రను ఖరారు చేసారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇదే ఫాలో అవ్వాలని… జక్కన్న కూడా భావిస్తున్నాడు. మార్కెటింగ్ విషయంలో జక్కన్నకు తిరుగు లేదు. బాహుబలి సినిమాతో తాను ఏ రేంజ్ లో మార్కెట్ చేయగలడో చూపించాడు కూడా.
అలాంటిది ఇప్పుడు స్నేహా రెడ్డిని ఫాలో అవుతున్నాడనే కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబుతో సినిమా చేస్తున్న జక్కన్న… ఈ సినిమాలో క్రికెటర్ లేదా ఓ ఫుట్ బాల్ ప్లేయర్ ను తీసుకోవాలని చూస్తున్నాడని టాక్. దీనికి సంబంధించి ఇప్పటికే జక్కన్న టీం వర్క్ కూడా స్టార్ట్ చేసింది. హాలీవుడ్ లో ఈ సినిమాతో పాగా వేయాలని జక్కన్న స్కెచ్ గీస్తున్నాడు. అందుకనే క్రికెటర్లు లేదా హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకోవాలని చూస్తున్నాడు. మరి ఇది ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి.