Sridevi: శ్రీదేవిని ట్రెండింగ్‌లో పెట్టిన జాన్వీ కపూర్‌

అప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌తో శ్రీదేవి ఉన్న ఫొటోలను, ఇప్పుడు జాన్వీ కపూర్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలను ఫ్రేమ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అలనాటి రాముడితో శ్రీదేవి, ఈనాటి రాముడితో జాన్వీ అంటూ వైరల్‌ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 7, 2023 / 05:38 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ 30 (NTR 30) సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినట్టు మూవీ టీం అనౌన్స్‌ చేసింది. నిజానికి చాలా రోజుల నుంచి ఈ గాసిప్‌ చెక్కర్లు కొడుతోంది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో అది కేవలం గాసిప్‌గానే మిగిలిపోయింది. ఇప్పుడు మూవీ టీం అధికారికంగా ప్రకటించడంతో.. ఆ గాసిప్‌ కాస్తా అఫీషియల్‌ అయిపోయింది.

అయితే.. ఈ కాంబినేషన్‌ ఫిక్స్‌ కావడంతో జాన్వీ కపూర్‌ తల్లి శ్రీదేవి (Sridevi) వైరల్‌ అవుతున్నారు. దీనికి కారణం జాన్వీ కపూర్‌ ఎన్టీఆర్‌ సినిమా ద్వారా టాలీవుడ్‌కు (Tollywood) పరిచయం కాబోవడం. 40 ఏళ్ల క్రితం రాఘవేంద్ర రావు (Raghavendra Rao) దర్శకత్వంలో వచ్చిన వేటగాడు (Vetagadu) సినిమాలో మొదటి సారి సీనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) పక్కన నటించారు శ్రీదేవి. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత వాళ్లిద్దరూ ఏకంగా 12 సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్లో వీళ్ల పెయిర్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉండేది. ఎన్టీఆర్‌, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ దాదాపుగా హిట్‌గానే నిలిచాయి.

దీంతో ఇప్పుడు ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్‌ కేరీర్‌ కూడా అద్భుతంగా ఉండబోతోందంటూ జోస్యం చెప్తున్నారు తారక్‌ (Tarak) ఫ్యాన్స్. అప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌తో శ్రీదేవి ఉన్న ఫొటోలను, ఇప్పుడు జాన్వీ కపూర్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలను ఫ్రేమ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అలనాటి రాముడితో శ్రీదేవి, ఈనాటి రాముడితో జాన్వీ అంటూ వైరల్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జాన్వీ కపూర్‌ కాంబినేషన్‌ ఫిక్స్‌ కావడంతో ఒకప్పటి శ్రీదేవి ఫొటోలు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి..