Janhvi Kapoor: కన్ఫర్మ్.. రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్..

దేవర సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించి మరిన్ని కమర్షియల్ సినిమాలు చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో జాన్వీకి మరో బడా మూవీలో ఛాన్స్ దొరికినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Updated On - February 19, 2024 / 04:02 PM IST

Janhvi Kapoor: శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ‘దఢక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే జాన్వీకి ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేకపోవడంతో ఇంకా స్టార్ హీరోయిన్ కాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్. ఇప్పటికే దేవర సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ‘తంగం’ అనే క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకి రానుంది జాన్వీ.

MEGASTAR CHIRANJEEVI: మెగా రచ్చ.. మరోసారి మెగాస్టార్.. ఊర్వశీ చిందులు

దేవర సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించి మరిన్ని కమర్షియల్ సినిమాలు చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో జాన్వీకి మరో బడా మూవీలో ఛాన్స్ దొరికినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే (RC 16) చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుందని ఆమె తండ్రి బోనీ కపూర్ ఇటీవలి ఇంటర్వ్యూలో అధికారికంగా ధృవీకరించినట్టు సమాచారం. జాన్వీ త్వరలో RC16 షూటింగ్‌ను ప్రారంభించనుందని.. ఆమెకు తన తల్లి దివంగత శ్రీదేవి ఆశీస్సులు ఉన్నాయని ఆయన అన్నారు. బోనీ కపూర్ చేసిన ఈ ప్రకటన అనేక రూమర్స్‌కు చెక్ పెట్టినట్టయ్యింది. ఇప్పుడు RC16లో మహిళా ప్రధాన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు. దేవర తర్వాత టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి ఇది రెండవ చిత్రం. ఇది ఖచ్చితంగా తెలుగులో మంచి ఛాన్స్. కాగా జూనియర్ నటిస్తున్న దేవర రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

అక్టోబర్ 10, 2024న ఈ చిత్రం విడుదలవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ ప్రకటన ఖచ్చితంగా మెగా అభిమానులను షాక్‌కి గురిచేసింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు జాన్వీ కపూర్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి ఏకంగా ఆరు కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.