Janhvi Kapoor: స్పీడ్ అదిరింది.. అప్పుడు ఎన్టీఆర్… ఇప్పుడు చరణ్…

తెలుగులో తన మొదటి సినిమా విడుదల కాకుండానే.. జాన్వీ మరో భారీ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న మూవీలో జూనియర్ శ్రీదేవికి ఛాన్స్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 06:20 PM IST

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో వరుసగా భారీ ఆఫర్లు పట్టేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది జాన్వీ. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఇక తెలుగులో తన మొదటి సినిమా విడుదల కాకుండానే.. జాన్వీ మరో భారీ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది.

VISHAL: ఇప్పట్లో లేనట్లేనా.. విశాల్ రాజకీయాల్లోకి రావడం లేదా..?

రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న మూవీలో జూనియర్ శ్రీదేవికి ఛాన్స్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్న ఈ స్పోర్ట్స్ డ్రామా.. ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ‘RC 16’లో హీరోయిన్ అంటూ జాన్వీతో పాటు సమంత, మృణాల్ ఠాకూర్, సాయి పల్లవి, రష్మిక ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు జాన్వీ పేరు ఖరారైనట్లు వినికిడి. ఆర్సీ 16 ఉత్తరాంధ్రతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అక్కడి నటుల్ని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు దర్శక, నిర్మాతలు. పైగా ఉత్తరాంధ్ర యాస తెలిసిన పలువురికి ఆడిషన్లు నిర్వహించి కొంతమందిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయాక.. ఈ షూటింగ్ షురూ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు జాన్వీ హీరోయిన్ అంటూ వార్తలు వస్తున్నాయి. జాన్వీ కపూర్‌కి తెలుగులో మొదటి రెండు సినిమాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్‌తో చేసే అవకాశం రావడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ సినిమాలు విజయం సాధిస్తే జాన్వీకి స్టార్ స్టేటస్ రావడంతో పాటు ఒక్కసారిగా మరిన్ని బడా ఆఫర్లు క్యూ కడతాయి అనడంలో సందేహం లేదు.