నానీ హీరోయిన్ తో జయం రవి ఎంగేజ్మెంట్…?

సినిమా వాళ్ళ జీవితాల విషయంలో అనవసరమైన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చిన్న విషయం బయటకు వస్తే చాలు వాళ్ళు విడిపోవడం లేదంటే పెళ్లి చేసుకోవడం జరిగే వరకు వదిలే ఛాన్స్ ఉండదు. సమంతా, నాగ చైతన్య విషయంలో ఇదే జరిగింది.

  • Written By:
  • Publish Date - October 26, 2024 / 07:51 PM IST

సినిమా వాళ్ళ జీవితాల విషయంలో అనవసరమైన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చిన్న విషయం బయటకు వస్తే చాలు వాళ్ళు విడిపోవడం లేదంటే పెళ్లి చేసుకోవడం జరిగే వరకు వదిలే ఛాన్స్ ఉండదు. సమంతా, నాగ చైతన్య విషయంలో ఇదే జరిగింది. వాళ్ళు ఇద్దరూ విడాకులు తీసుకునే వరకు సోషల్ మీడియా జనాలు వదలలేదు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్, అభిషేక్ విషయంలో ఇదే జరుగుతోంది. ఆమె ఇప్పుడు వేరే వాళ్లకు దగ్గరైందని త్వరలోనే అభిషేక్ కు గుడ్ బై చెప్పేస్తుందని ప్రచారం మొదలుపెట్టారు.

ఈ విషయంలో ఐశ్వర్య క్లారిటీ ఇచ్చినా సరే వదిలిపెట్టలేదు. అమీర్ ఖాన్… కిరణ్ రావుతో దూరమైన తర్వాత ఇలాగే ప్రచారం మొదలుపెట్టారు. ఎవరినో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ మూడు నాలుగు పేర్లు బయటకు వచ్చాయి. ఇక తమిళ హీరో జయం రవి విషయంలో కూడా ఇప్పుడు ఇదే మొదలయింది. ఇటీవల తన భార్యతో విభేదాల కారణంగా దూరమైన జయం రవి… ఇప్పుడు మరో వివాహం చేసుకుంటున్నారు అనే ప్రచారం స్టార్ట్ చేసారు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో అతని వివాహం గురించి రూమర్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో.

ఇక ఇప్పుడు నానీతో కలిసి సరిపోదా శనివారం అనే సినిమాలో నటించిన ప్రియాంకా ఆరుళ్ మోహన్ తో అతని వివాహం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ప్రియాంక క్లారిటీ ఇచ్చింది. తాము ఓ సినిమాలో నటించిన ఫోటోని వైరల్ చేస్తూ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ చేస్తున్న ప్రచారంపై మండిపడింది. జయం రవి, నేను కలిసి ‘బ్రదర్’ సినిమా కోసం వర్క్ చేశామని తెలిపిన ఆమె… ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్రబృందం ఒక ఫొటో రిలీజ్ చేసిందని… అందులో మేమిద్దరం మెడలో పూలదండలు వేసుకుని ఉంటామని… దాంతో అది నెట్టింట వైరల్ గా మారిందని, అది చూసి చాలామంది మాకు ఎంగేజ్మెంట్ అయిందనుకున్నారని షాక్ అయింది.

వరుస సినిమా షూట్స్ తో బిజీగా ఉండటంతో ఆ విషయం నా దృష్టికి రాలేదని తెలిపింది. ఆ సమయంలో ఇది నిజమేనని నమ్మిన టాలీవుడ్లోని నా స్నేహితులు వరుస కాల్స్ చేశారని… కంగ్రాట్స్ కూడా చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏం జరుగుతుందో నాకు అర్థంకాలేదని… పూర్తి విషయం తెలుసుకుని అది కేవలం సినిమాలోని స్టిల్ మాత్రమేనని చెప్పా అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత మా మూవీ టీమ్ను తిట్టుకున్నా అని… వేరే ఫొటో ఏదైనా రిలీజ్ చేయొచ్చు కదా… ఇది ఎందుకు చేశారనుకున్నా అంటూ ప్రియాంక క్లారిటీ ఇచ్చేసింది.