Drishyam: హాలీవుడ్‌లో రీమేక్ కాబోతున్న దృశ్యం.. సంచలనం ఖాయమా..?

మలయాళంలో తెరకెక్కిన మోహన్ లాల్ అండ్ టీం వ్యథలు. ఇవే తెలుగు, తమిళ్, కన్నడంతోపాటు హిందీలో రీమేక్ అయ్యాయి. ఆఖరికి చైనాలో కూడా రీమేకయ్యాయి. మలయాళ మూవీకి అంత దృశ్యం ఉందా అనిపించేలా ఈ రెండు మూవీలు షాక్ ఇచ్చాయి.

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 05:44 PM IST

Drishyam: వెంకీ చేసిన ద్రుశ్యం, ధ్రుశ్యం 2 రెండూ కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ఇప్పడు ఇవే కథలు హాలీవుడ్ బాట పట్టాయి. అలాగని ఇవి టాలీవుడ్ కథలు కాదు. మలయాళంలో తెరకెక్కిన మోహన్ లాల్ అండ్ టీం వ్యథలు. ఇవే తెలుగు, తమిళ్, కన్నడంతోపాటు హిందీలో రీమేక్ అయ్యాయి. ఆఖరికి చైనాలో కూడా రీమేకయ్యాయి. మలయాళ మూవీకి అంత దృశ్యం ఉందా అనిపించేలా ఈ రెండు మూవీలు షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలు కొరియాలో రీమేక్ కాబోతున్నాయి. హాలీవుడ్‌లో కూడా రీమేక్‌కి రెడీ అయ్యాయి.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్‌తో మళ్లీ బాలయ్య ఢీ.. ఈసారి నాగ్, వెంకీ కూడా..

నిజంగానే దృశ్యం కంటెంట్ అంతగా వరల్డ్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందా.. అంటే, చైనాలో రీమేక్ అయ్యాక దీనికి వచ్చిన స్పందనే ఉదాహరణ. ఇది చైనాలో రీమేకై వసూళ్లతో అద్భుతాలు చేయకపోయినా అక్కడ మంచి మౌత్ టాక్ తెచ్చుకున్న సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. సాధారణంగా హాలీవుడ్ నుంచి కొరియా సినిమాల వరకు కథలో, సీన్లు కాపీ కొట్టడమో చేస్తుంటారని ఇండియన్ సినిమాల గురించి వినే ఉంటాం. కానీ, ఫస్ట్ టైం.. మన సౌత్ సినిమా హాలీవుడ్ నుంచి కొరియా వరకు రీమేక్ కాబోతోంది. ఇదొక్కటేనా.. గతంలో టాలీవుడ్‌కి కూడా ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. గీతాకృష్ణ తీసిన 1990లనాటి మూవీ కోకిల హాలీవుడ్‌లో కూడా వచ్చింది.

అఫీషియల్ రీమేక్ కాదుకాని మనతెలుగు సినిమాకు కాపీ అనేలా హాలీవు్డ్ మూవీ ఉండటం బట్టి చూస్తే, మన దగ్గర కూడా ఒరిజినల్ కంటెంట్ ఓస్థాయిలో వచ్చిన సందర్భాలున్నాయి. ఏదేమైనా దృశ్యం హాలీవుడ్‌లో రీమేక్ అయితే, సౌత్ సినిమా స్థాయి పెరగిందనక తప్పదు. బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి మూవీలు పాన్ ఇండియాని షేక్ చేస్తే, కేజీయఫ్, విక్రమ్ లాంటి మూవీలతో శాండిల్ వుడ్, కోలీవుడ్ స్పీడ్ పెంచాయి. ఇక మళయాలం మూవీస్ కూడా దృశ్యం లాంటి ప్రయోగాలతో సౌత్ సినిమా స్థాయిని పెంచాయి. ఒక్క బాలీవుడ్ మాత్రమే ఈ విషయంలో భారీగా వెనకబడిపోతోంది.