టాలీవుడ్ లో అల్లు అర్జున్ లో అరెస్టు చేయడం ఏమో గాని కొంతమంది మాత్రం చాలా హ్యాపీగా కనపడుతున్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడాన్ని మెగా ఫాన్స్ ముందు కాస్త సీరియస్ గా తీసుకున్నారు. ఆ తర్వాత వారిలో ఏదో తెలియని సంతోషం కనబడుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ బయటకి వెళ్లడం ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం… అసలు మెగా ఫ్యామిలీ ఇమేజ్ లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ అయిపోవాలి అనుకోవడం అన్నీ కూడా మెగా ఫాన్స్ కి ఏమాత్రం నచ్చలేదు.
చిరంజీవికి కూడా ఇది పరిణామాలు జీర్ణించుకోలేని రేంజ్ లోనే ఉన్నాయి. అల్లు అర్జున్ ఆటిట్యూడ్ చూపించాడు అనే కామెంట్స్ కూడా చాలామంది చేశారు. బీహార్ లోని పాట్నాలో జరిగిన ఈవెంట్లో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ పై చాలా కామెంట్స్ వచ్చాయి. అలాగే హైదరాబాదులో కూడా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ పై చాలా మంది చాలా విమర్శలు చేశారు. అసలు పుష్ప సినిమాకు ప్రముఖులను ఎవరిని కావాలనే పిలవకుండానే ఈవెంట్స్ చేశారు అనే టాక్ కూడా టాలీవుడ్ వర్గాల్లో ఉంది.
ఇక ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జానీ మాస్టర్ చాలా సంతోషంగా ఉన్నాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. రెండు మూడు నెలల క్రితం జానీ మాస్టర్ పై ఒక రేప్ కేసు నమోదు అయింది. ఆ రేప్ కేసు నమోదు అయిన తర్వాత చాలామంది అనుమానించింది అల్లు అర్జున్ ని. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసే అమ్మాయితో అల్లు అర్జున్ కేసు పెట్టించాడు అనే వార్తలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. జానీ మాస్టర్ అరెస్టు అయిన తర్వాత అల్లు అర్జున్ ఆ అమ్మాయికి ఫోన్ చేశాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఫోన్ చేసి అల్లు స్టూడియోస్ లో ఆ అమ్మాయికి జాబ్ కూడా ఇస్తామని హామీ ఇచ్చాడని, అలాగే తన ప్రతి సినిమాల్లో కూడా అమ్మాయికి జాబ్ ఇస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనితో ఇవన్నీ గమనిస్తున్న జనాలు మెగా ఫ్యామిలీ పై కోపంతోనే జానీ మాస్టర్ విషయంలో అల్లు అర్జున్ అలా చేసి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. మెగా హీరోలకు అల్లు అర్జున్ కు మధ్య ఆధిపత్య పోరునడుస్తోంది. ఈ పోరులో జానీ మాస్టర్ బలైపోయాడు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సంధ్య థియేటర్ ఘటన విషయంలో నాన్నా కష్టాలు పడటం చూస్తుంటే జానీ మాస్టర్ చాలా హ్యాపీగా ఉన్నాడు అనే కామెంట్స్ వస్తున్నాయి.