Allu Arjun: మైత్రీ మూవీ మేకర్స్‌తోపాటు, సుకుమార్ మీద జరిగిన ఐటీ రైడ్స్ వల్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరోక్షంగా ఇబ్బంది పడ్డాడు. దీనివల్ల తన పుష్ప-2 మూవీ స్పీడ్‌కి బ్రేక్ పడిందని కంగారు పడుతున్నాడు. ఇలాంటి టైంలో రిలయన్స్ వాళ్ల జియో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. దీంతో బన్నీ ఫ్యామిలీ షాక్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
జియో ఫైబర్ నెట్‌తో ఇప్పటికే ఫోర్‌జీ స్పీడ్‌తో ఇండియాలో ఇంటర్నెట్ తలరాతే మార్చేశాడు ముఖేష్ అంబాని. అలాంటి తను ఇప్పుడు జియో సినిమాను షురూ చేశాడు. వచ్చే నెల నుంచి ఈ ఓటీటీ సంస్థ రంగంలోకి దిగనుంది. ఒక వైపు అమేజాన్ ప్రైమ్ రేట్లు పెంచింది. నెట్ ఫ్లిక్స్ ఎప్పటి నుంచో మిడిల్ క్లాస్ భరించలేని రేట్లతో ప్యాకేజీలు వదులుతోంది. అందుకే వీటి దూకుడుకి బ్రేక్ వేసేందుకు సీన్‌లోకి జియో సినిమా రాబోతోంది. జియో సినమాకు బన్నీ ఫ్యామిలీకి ఓ లింకుంది. అదే టోటల్ ఫ్యామిలీని కంగారుపెడుతోందట. హెచ్‌బీవో, వార్నర్ బ్రదర్స్.. ఇలా టాప్ ప్రొడక్షన్ హౌజ్‌లతో టైఅప్ అయిన జియో సినిమా టీం, వాటి వెబ్ సీరీస్‌లు, సినిమాలను జియో సినిమాలో అందుబాటులోకి తీసుకు రానుందట.
అంతేకాదు 18 భాషల్లో జియో సినిమాను రీ డిజైన్ చేయిస్తోందట. అదే జరిగితే తమిళ్, మలయాళం, కన్నడ మార్కెట్‌లో ఆహా ఓటీటీని మెరిసేలా చేయాలన్న అల్లు అరవింద్ కల నెరవేరదు. ఆహాలో బన్నీ కూడా పెట్టుబడులు పెడ్డటం వల్ల, ఇప్పుడు జియో సినిమా దెబ్బకి షాక్ కొట్టేలా ఉంది. అసలు జియో వచ్చీరాగానే టోటల్ ఇండియా ఇంటర్నెట్టే కాదు, మొబైల్ వరల్డ్ రూపు రేఖలే మారిపోయాయి. అలానే జియో సినిమా వస్తే, పోటీ ఇచ్చే ఓటీటీ సంస్థలన్నీ పక్కకుపోక తప్పని పరిస్థితులు వస్తాయి. అదే అసలు టెన్షన్.