బన్నీ అరెస్ట్ పై జానీ మాస్టర్ కామెంట్, వాళ్లకు మంచి జరగాలి

స్టార్ హీరో అల్లు అర్జున్ పరిస్థితి ప్రస్తుతానికి దారుణంగానే ఉంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ను విచారించారు మంగళవారం. ఇక ఏం జరుగుతుందో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 24, 2024 / 09:50 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ పరిస్థితి ప్రస్తుతానికి దారుణంగానే ఉంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ను విచారించారు మంగళవారం. ఇక ఏం జరుగుతుందో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక స్టార్ హీరోకు అటువంటి పరిస్థితి వస్తోందని ఎవరు ఊహించలేదు కూడా. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం మలుపు తిరగడంతో ఏం జరగబోతుంది ఏంటి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో అల్లు అర్జున్ అంత తేలిగ్గా ఈ వ్యవహారం నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడటం లేదని చెప్పాలి.

ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్… అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై చాలా సంతోషంగా ఉన్నాడంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ అరెస్టు కావడానికి అల్లు అర్జున్ కూడా ఒక కారణం అనే అభిప్రాయం అప్పట్లో వినిపించింది. అలాగే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన అమ్మాయికి అల్లు అర్జున్ పూర్తిగా సపోర్ట్ చేశాడని… అల్లు స్టూడియోస్ లో ఆమెకు ఉద్యోగం కూడా ఇప్పించాడని అప్పట్లో పెద్ద ఎత్తున మీడియాలో హడావుడి జరిగింది.

ఇక తాజాగా జానీ మాస్టర్ ను మీడియా ఈ వ్యవహారంపై ప్రశ్నించింది. దీనిపై మీ అభిప్రాయం చెప్పాలని అడగగా జానీ మాస్టర్ కామెంట్ చేశాడు. ఈ విషయంలో తానేమీ మాట్లాడదలచుకోలేదని తానే ఒక ముద్దాయినని… తనపై కూడా ఆరోపణలు ఉన్నాయని నా కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదన్నాడు జానీ మాస్టర్. న్యాయస్థానంపై తనకు చాలా నమ్మకం ఉందని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించాడు. ఇక జైలుకు వెళ్ళకముందు వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఏ విధంగా ఉందని అడగగా…

అప్పుడు ఇప్పుడు తేడా లేదని గుండెల మీద చేయి వేసి మరీ చెప్తున్నా సినిమా పరిశ్రమంలో తన గుర్తింపు అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉందన్నాడు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన అమ్మాయి పుష్ప సినిమా సెట్ లో కూడా హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె పుట్టినరోజుని పుష్ప సినిమా యూనిట్ ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సెట్ లో ఆమె కొన్ని వీడియోలు కూడా షూట్ చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై ఉండగా ఆయన తిరిగి మళ్లీ తన కెరీర్ను మొదలు పెడుతున్నాడు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో జానీ మాస్టర్ సాంగ్స్ రెడీ అవుతున్నాయి. ఇక అరెస్టు కావడంతో జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే.