జానీ మాస్టర్ రేప్ కేసు… ఏం జరుగుతోంది…?

ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై నమోదు అయిన కేసులో పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు. నేడు మూడో రోజు జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీలో విచారణ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 27, 2024 / 08:55 AM IST

ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై నమోదు అయిన కేసులో పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు. నేడు మూడో రోజు జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీలో విచారణ చేస్తున్నారు. నిన్న ఉదయం జానీ మాస్టర్ కు గోల్కొండ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. అనంతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ ను విచారించారు. లైంగిక దాడికి సంబందించి పలు ప్రశ్నలు వేసారు.

ఔట్ డోర్ షూటింగ్స్ సమయం లో జరిగిన లైంగిక దాడులపై ఆరా తీసిన పోలీసులు.. జానీ మాస్టర్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలకు సంబంధించి నేడు జానీ మాస్టర్ ను మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే బాధితురాలు పలు ఆధారాలు కూడా సమర్పించినట్టు సమాచారం.