Bhagavanth Kesari: ఐ డోంట్ కేర్.. బాలయ్యతో అట్లుంటది మరి..!

మూవీ ఎలా ఉండబోతుందో సర్‌ప్రైజ్ వీడియోతో చిన్న హింట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషి చేశాడు యంగ్ డైరెక్టర్. భగవంత్ కేసరి మెమొరబుల్‌ జర్నీని ఒక క్లిప్‌లో చూపించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ప్యాకప్ అయ్యే వరకు కొన్ని షాట్స్ వీడియోలో చూపించి థ్రిల్ చేశాడు.

  • Written By:
  • Updated On - September 29, 2023 / 08:27 PM IST

Bhagavanth Kesari: బాలయ్య సినిమా అంటే నూటికి నూరుశాతం అది వన్ మేన్ షోనే అవుతుంది. ఎలాంటి కథ అయినా.. ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరి అంతకు మించి అనేలా ఉండబోతుందని తెలుస్తోంది. మచ్చుకు రెండు డైలాగ్స్ వినిపించి బాలయ్య మేనియాను షురూ చేశాడు దర్శకుడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈమూవీలో యాక్షన్ సీన్లు నెక్ట్స్ లెవల్‌లో ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే మూవీ ఎలా ఉండబోతుందో సర్‌ప్రైజ్ వీడియోతో చిన్న హింట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషి చేశాడు యంగ్ డైరెక్టర్. భగవంత్ కేసరి మెమొరబుల్‌ జర్నీని ఒక క్లిప్‌లో చూపించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ప్యాకప్ అయ్యే వరకు కొన్ని షాట్స్ వీడియోలో చూపించి థ్రిల్ చేశాడు. సినిమా టీమ్.. మూవీ కోసం 8 నెలలు, 24 లొకేషన్స్, 12 మాసివ్ సెట్స్ తో షూటింగ్ కంప్లీట్ చేయడం కోసం శ్రమించిన తీరు అద్భుతంగా చూపించారు. ఇక బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ మాస్ డైలాగ్ రచ్చ లేపుతోంది. కలిసి మాట్లాడతాను అన్నాకదా.. ఇంతలోనే మందిని పంపాలా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే అన్న డైలాగ్ సోషల్ మీడియాలో మోత మోగిస్తోంది.

ఇక చివర్లో బ్రో.. ఐ డోంట్ కేర్ అని చెప్పడం చూస్తుంటే.. బాలయ్య మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయించడం పక్కా అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఇప్పటి నుంచే రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య పలికిన మాస్ డైలాగ్స్‌తో పాటు అక్టోబర్ 19న థియేటర్లలో కలుద్దాం.. అంటూ అనిల్ రావిపూడి విడుదల చేసిన వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.