Jr NTR-ATLEE: ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో ఉంది. దేవర సినిమాతో రికార్డుల ఊచకోత కోసేందుకు కసిగా సిద్ధమవుతోన్న యంగ్ టైగర్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తారక్ లైనప్‌లో భారీ సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రెస్టీజియస్ మూవీసే కావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జూనియర్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
ssmb 29: జపాన్ ప్రేక్షకులకు రాజమౌళి గ్రేట్ ప్రామిస్.. ఖుషీలో మహేష్ ఫ్యాన్స్ !
సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో జూనియర్ చేయబోయే మూవీకి సంబంధించిన లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తారక్-అట్లీ కాంబోలో మూవీపై ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ లేటెస్ట్గా వీరిద్దరి కాంబోతో ఓ మూవీ ఫిక్సయ్యిందంటూ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ తమిళ దళపతి విజయ్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. విజయ్ 68వ సినిమాగా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. పైగా విజయ్ – అట్లీ కలయికలో వస్తున్న నాలుగో సినిమా కావడంతో విజయ్ ఫ్యాన్స్ హైఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక.. విజయ్‌తో సినిమా పూర్తి చేసిన వెంటనే.. ఎన్టీఆర్‌తో మూవీ చేసేందుకు అట్లీ ప్లాన్ చేస్తున్నాడట. 2026 ఎండింగ్లో ఎన్టీఆర్ – అట్లీ కలయికలో సినిమా మొదలు అవుతుందని టాక్ వినిపిస్తోంది. నిజానికి గతంలోనే ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేశాడు అట్లీ. కానీ అప్పుడు సెట్ కాలేదు. అందుకే, విజయ్‌తో సినిమా పూర్తి చేసిన వెంటనే ఈ మూవీని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.
అంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. అయితే.. మూవీ కాస్త లేట్ అయినా.. లేటెస్ట్గా వస్తుందని తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే.. సోషల్ మెసేజ్‌కు స్టైలిష్ యాక్షన్ మాస్ అంశాలను మేళవించి సినిమాలు తెరకెక్కించడం డైరెక్టర్ అట్లీ స్పెషాలిటీ. ఇక.. జూనియర్ ఎన్టీఆర్ నటవిశ్వరూపం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో.. ఈ పవర్ఫుల్ కాంబోలో రాబోయే మూవీ సెన్సేషన్ క్రియేట్ ఖాయమంటూ జూనియర్ – అట్లీ కామన్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేశారు.