Jr NTR: హీరోయిజం బోర్ కొట్టిందంటున్న మ్యాన్ ఆఫ్ మాసెస్

ఎన్టీఆర్, హృతిక్ రోషన్, చియాన్ విక్రమ్, దుల్కర్ సల్మాన్.. ఈనలుగురు సడన్‌గా హీరోయిజం వద్దు, విలనిజమే ముద్దనేశారు. హిందీ మూవీ వార్ సీక్వెల్ వార్ 2లో విలన్‌గా నటించేందుకు ఎన్టీఆర్ ఎప్పుడో సిద్దమైతే, అందులో హీరో అయిన హృతిక్ ఇప్పుడిప్పుడే రాజమౌళి సినిమాలో విలన్‌గా నటించేందుకు రెడీ అవుతున్నాడు.

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 09:17 PM IST

Jr NTR: హీరో విలన్ వీపు విరిచేస్తే, విజిల్స్ పడతాయి. విలన్ మీద పంచ్ డైలాగ్స్ వేస్తే చప్పట్లు పడతాయి. సినిమాలో హీరో ఎన్ని కష్టాలు పడ్డా చివిరికి గెలిచేది హీరోనే. ఓడేది విలనే. అలాంటిది గెలుపు బోర్ కొట్టిందో లేక చప్పట్ల సౌండ్ మీద విరక్తి విచ్చిందో కాని, సడన్‌గా హీరోలకి, వాల్ల హీరోయిజమే నచ్చట్లేదు. కొందరు యూటర్న్ తీసుకుని విలన్లుగా మారారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, చియాన్ విక్రమ్, దుల్కర్ సల్మాన్.. ఈనలుగురు సడన్‌గా హీరోయిజం వద్దు, విలనిజమే ముద్దనేశారు.

Line Man Telugu Movie: లైన్‌మెన్ కత్తిరిస్తే.. కరెంట్ షాకేనా..?

హిందీ మూవీ వార్ సీక్వెల్ వార్ 2లో విలన్‌గా నటించేందుకు ఎన్టీఆర్ ఎప్పుడో సిద్దమైతే, అందులో హీరో అయిన హృతిక్ ఇప్పుడిప్పుడే రాజమౌళి సినిమాలో విలన్‌గా నటించేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి హృతిక్ ఒప్పుకోకపోతే చియాన్ విక్రమ్‌ని విలన్‌గా తీసుకోవాలనుకున్నాడు రాజమౌళి. కాని హృతిక్ నుంచి ఆల్‌మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఎంతగా మహేశ్ మూవీలో తన పాత్ర తప్ప మరెవర్ని నిర్ణయించలేదని జక్కన్న తేల్చినా, తెరవెనక జరగాల్సిన పనులు సైలెంట్‌గా జరిగిపోతున్నాయి. అంతేకాదు.. చియాన్ విక్రమ్‌ని రామ్ చరణ్‌తో బుచ్చిబాబు తీసే సినిమాలో విలన్‌గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

విజయ్ సేతుపతి నో చెప్పటం వల్లే విక్రమ్ డేట్స్ కోసం బుచ్చిబాబు టీం ప్రయత్నిస్తోంది. కురూప్‌లో నెగెటివ్ రోల్ వేసిన దుల్కర్ సల్మాన్, రణ్ వీర్ సింగ్ హిందీ మూవీలో విలన్‌గా నటించబోతున్నాడు. బేసిగ్గా విలన్‌గా నటించి తర్వాత హీరోలుగా మారటం చూశాం. కానీ, హీరోలుగా పాన్ ఇండియా మార్కెట్‌ని ఏలే బ్యాచ్ కూడా విలన్లుగా మారటమే అర్ధం కాని ట్రెండ్‌గా మారింది.