Jr NTR: హృతిక్, ఎన్టీఆర్ కోసం రెడీ అవుతున్న సిగ్నేచర్ సాంగ్..?

హృతిక్ బేసిగ్గా ఓరేంజ్ డాన్సర్. ఎన్టీఆర్ కూడా డాన్స్‌లో దుమ్ముదులిపేస్తాడు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లు వేరు. కానీ, ఇద్దరూ సూపర్ డాన్సర్లే. అలాంటి ఇద్దర్నీ ఒకే తెరకమీద చూపిస్తూ నాటు నాటు సాంగ్ లాంటి పాటలేకపోతే, అసలది సినిమానే కాదు.

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 06:41 PM IST

Jr NTR: నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చింది. హాలీవుడ్ స్టార్స్ నుంచి అమెరికా, యూరప్ వాసులకు ఆ పాట తెగ నచ్చింది. దానికి కారణం నాటు నాటు పాటలో తారక్, చరణ్ మంచి సింక్ తో డాన్స్ చేయటం, కొరియోగ్రఫి అలా కుదరటం, సాంగ్‌లో నాటుతనం బాగా కనెక్ట్ అవటం. ఇంకా చెప్పాలంటే మంచి కాన్సెప్ట్ కనెక్ట్ అవటం. ఇప్పుడు ఇలాంటి సీనే రిపీట్ కాబోతోంది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో చేయబోతున్న మొదటి హిందీ మూవీ వార్ 2లో నాటు డాన్స్ రిపీట్ అయ్యేలా ఉంది.

HARISH SHANKAR: మీరు ఒకటి అంటే.. నేను వంద అంటా.. మీడియాతో ఫైట్‌కి హరీశ్ శంకర్ రెడీ

హృతిక్ బేసిగ్గా ఓరేంజ్ డాన్సర్. ఎన్టీఆర్ కూడా డాన్స్‌లో దుమ్ముదులిపేస్తాడు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లు వేరు. కానీ, ఇద్దరూ సూపర్ డాన్సర్లే. అలాంటి ఇద్దర్నీ ఒకే తెరకమీద చూపిస్తూ నాటు నాటు సాంగ్ లాంటి పాటలేకపోతే, అసలది సినిమానే కాదు. అందుకే దానికి తగ్గ ప్రయత్నాలు మొదలయ్యాయి. వార్ 2లో హృతిక్‌కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుంది. అంటే విలనే అనుకోవక్కర్లేదు. అలాంటి షేడ్సే కాని పూర్తిగా విలన్ కాదని తెలుస్తోంది. అయితే వార్ 1లో హ్రితిక్ తో టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన డాన్స్, ఆ పాట దుమ్ముదులిపింది.

ఇప్పడు ఆస్కార్ అందుకున్న నాటు పాటలో మెరిసిన తారక్‌తో హృతిక్ సినిమా అంటే, పక్కా డాన్స్ నంబర్ ఉండితీరుతుంది. అయితే, అది నాటు నాటుకు మించేలా ప్లాన్ చేయక తప్పదు. అందుకే ఆ స్పెషల్ సాంగ్ కోసం మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ని రంగంలోకి దింపుబోతున్నారట.