DEVARA: కొరటాల శివ చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్న తారక్

ఆచార్య గోల తీరిందనుకునే టైంలో, దేవర కథ నచ్చక ఆ స్టోరీని ఆపేశారు. తర్వాత మరో కథని రెడీ చేయటంతో దేవర పట్టాలెక్కింది. సరే.. దేవరకి రెండో భాగం ఉందని తేల్చి కొరటాల శివ అలా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడనుకుంటే, అక్కడ ఇప్పుడు శ్రీమంతుడి పంచ్ పడింది.

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 05:32 PM IST

DEVARA: కొరటాల శివ కోర్టు గొడవలతో, ఎన్టీఆర్‌కి శిక్ష పడుతోంది. నిజానికి శ్రీమంతుడు కాపీ రైట్స్ ఇష్యూకి ముందే కొరటాల శివ వల్ల ఎన్టీఆర్ సినిమా దేవరకు ఇలాంటి పంచే పడింది. అప్పుడు కూడా నష్టపోయింది మ్యాన్ ఆఫ్ మాసెసే. ఆచార్య ఫ్లాప్ తర్వాత బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొరటాల శివ గొంతు మీద కూర్చున్నారు. ఎగ్జాక్ట్‌గా ఎన్టీఆర్ మూవీ మొదలయ్యే టైంలోనే ఈ నాన్సెన్స్ అంతా జరిగింది. తర్వాత కొరటాల శివనే ఆస్తులమ్మి ఆచార్య నష్టాల వల్ల తను కట్టాల్సిన ఎమౌంట్ కట్టాల్సి వచ్చింది.

DIRECTOR SUJEETH: OG తర్వాత.. మహేశే టార్గెట్.. సుజిత్ ప్లాన్ ఇదే..!

అలా ఆచార్య గోల తీరిందనుకునే టైంలో, దేవర కథ నచ్చక ఆ స్టోరీని ఆపేశారు. తర్వాత మరో కథని రెడీ చేయటంతో దేవర పట్టాలెక్కింది. సరే.. దేవరకి రెండో భాగం ఉందని తేల్చి కొరటాల శివ అలా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడనుకుంటే, అక్కడ ఇప్పుడు శ్రీమంతుడి పంచ్ పడింది. ఆ కథ స్వాతి మ్యాగజైన్‌లో వచ్చిందని వేసిన కేసుకి, సుప్రీం కోర్టు సాక్షిగా అసలు రైటర్ శరత్ చంద్రకు సపోర్ట్ దొరికింది. సో.. తనతో డీల్ సెట్ చేసుకోవటం తప్ప మరో ఆప్షన్ లేదంటున్నారు. సరే.. బయటే సెట్ చేసుకుందామంటే, అక్కడ ఏకంగా రూ.30 కోట్ల వరకు నష్టపరిహారం అడుగుతున్నాడట రైటర్ శరత్ చంద్ర. ఇలా సెటిల్ చేసుకోకపోతే, కొరటాల శివ క్రిమినల్ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది.

అది దేవర మూవీ మార్కెట్‌ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది. సరే.. శ్రీమంతుడు కోర్టు కేసుని సెటిల్ చేసుకున్నాకాని, దేవర మూవీ కూడా ఎక్కడ కాపీ కొట్టిందో అనే ప్రచారం ఆల్రెడీ మొదలైంది. ఇది కూడా దేవర సినిమాకు డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ చేయని నేరానికి ఇప్పటికే కొరటాల వల్ల రెండేళ్లు వృథా అయ్యాయి. అలా అయినా దేవర పూర్తవుతోంది కదా అనుకుంటే, ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఇలా ఏదో ఒక గొడవ కామనైంది.