Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ భగవంత్ కేసరి. ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉండే అనిల్ రావిపూడి మొదటి సారి.. అది కూడా బాలకృష్ణతో యాక్షన్ సినిమా ట్రై చేశాడు. ఈ సినిమాతో సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు అనిల్. శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాకు రూ.32 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ గత సినిమా వీరసింహారెడ్డితో కంపేర్ చేస్తే కలెక్షన్స్ భారీగా తగ్గినట్టు క్లియర్‌గా తెలుస్తోంది. నిజానికి బాలకృష్ణ సినిమా యావరేజ్‌గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి. మాస్ ఆడియన్స్‌లో బాలకృష్ణకు ఉన్న క్రేజ్ అది. కానీ ఈ సారి మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. దీంతో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాయ్‌కాట్ చేసినట్టు చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో బాలకృష్ణ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఎవరి స్పందన కోసమో మేం చూడం అంటూ చెప్పాడు.
దీంతో ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే భగవంత్ కేసరి సినిమాను బాయ్‌కాట్ చేశారని.. ఆ కారణంగానే కలెక్షన్స్ తగ్గాయంటూ చర్చ జరుగుతోంది. ఈ టాపిక్‌లో నిజం ఎంతో తెలియదు కానీ.. బాలకృష్ణ సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడంపై ఆయన ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు.